పదో తరగతి ఫలితాల్లో దుగ్గొండి రికార్డ్....

0
168

భారత్ అవాజ్ న్యూస్: దుగ్గొండి : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో దుగ్గొండి మండలం అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మండల వ్యాప్తంగా పరీక్షలకు హాజరైన మొత్తం 280 మంది విద్యార్థులూ ఉత్తీర్ణులై, నూరు శాతం ఫలితాలతో రికార్డు సృష్టించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం ప్రైవేటుకు దీటుగా మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం. ఈ ఫలితాల్లో జె. కావ్యశ్రీ 566 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. మల్లంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఎంజేపీ విద్యార్థి ఎన్. లోకేష్ 560 మార్కులతో ద్వితీయ స్థానం, దుగ్గొండి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన కె. లోకేష్ 554 మార్కులతో తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. మండలం సాధించిన ఈ ఘనతపై మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) వెంకటేశ్వర్లు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొంటూ విజేతలందరినీ అభినందించారు.. భవిష్యత్తులోనూ విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు....

భారత్ అవాజ్ న్యూస్: రిపోర్టర్ జి రాము దుగ్గొండి....

Search
Categories
Read More
Telangana
ఊరు ఊర అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
27-032026ఊరు ఊర అంగరంగవైభవంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ...
By MERIGE MALLESH 2026-03-27 11:19:09 0 345
Telangana
పెద్దపల్లి : బైపాస్ రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్...
పెద్దపెల్లి మండలంలోని పెదకలువల నుంచి అప్పన్నపేట గ్రామం వరకు నూతనంగా నిర్వహిస్తున్న బైపాస్ రహదారి...
By Sunka Santhosh 2026-06-16 19:52:48 0 142
Andhra Pradesh
హాస్టల్స్‌లో వసతుల జిఓ 46 ఎందుకు అమలు చేయడం లేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
హాస్టల్స్‌లో వసతుల జిఓ 46 ఎందుకు అమలు చేయడం లేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు...
By Gadiyapudi Narendra 2026-01-03 16:50:11 0 460
Lakshdweep
Reforms 3.0: Roadmap to India's 8% Economic Growth Surge
Experts have unveiled an ambitious policy roadmap called "Reforms 3.0" with the aim of taking the...
By Lokeshwari Panthadi 2026-06-30 10:27:51 0 80
Andhra Pradesh
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నా. చమర్తి
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించిన - తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్...
By Benguluri Madhubabu 2026-08-02 10:40:21 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com