పోగొట్టుకున్న లక్ష రూపాయలు సొమ్ము తిరిగి ఇచ్చిన అర్చకులు సాయిరాం

0
258

 

నందిగామ ఎన్టీఆర్ జిల్లా 

డబ్బులు, విలువైన వస్తువులు దొరికితే తమ సొంతం చేసుకుంటారుగానీ, పోగొట్టుకున్న వ్యక్తులకు వాటిని అప్పగించాలని ఆలోచించరు. వాటిని చూడగానే మనిషి ప్రవర్తన మారిపోతుంది. కానీ, కొందరు మాత్రం తమది కానిది ఒక్క రూపాయి కూడా ఆయాచితంగా తీసుకోడానికి ఇష్టపడరు. పరుల సొమ్ముకు ఆశపడకుండా ఆత్మాభిమానంతో ఉంటారు.

తాజాగా, అలాంటి సంఘటన గురువారం సాయంత్రం నందిగామ శివారు గ్రామీణ ప్రాంతంలో చోటుచేసుకుంది 

నందిగామ మండలం రాగాపురం నివాసి రుద్రవరం గొర్రెలు కొనడానికి వెళ్లి వస్తూ ఉండగా లక్ష రూపాయల బ్యాగును పోగొట్టుకున్నాడు. ఇంటికి వెళ్లి బ్యాగు లేకపోయేసరికి ఎక్కడ పోగొట్టుకున్నాడో తెలియక బాధపడుతూ ఉన్నాడు.

కానీ ఆ రాత్రి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం గొల్లమూడి శివాలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న తొర్లపాటి సాయిరాం కు 1 లక్ష రూపాయలు బ్యాగు రోడ్డుపై  దొరికింది.

వెంటనే అర్చకులు సాయిరాం గొల్లమూడి శివాలయం గ్రూపులో ఈ సమాచారాన్ని అందించారు సమాచారం తెలుసుకున్న బాధితులు గొల్లమూడి శివాలయం అర్చకుల్ని సంప్రదించారు.

శుక్రవారం ఉదయం నందిగామ వినాయకుడి గుడి అర్చకులు ప్రధాన అర్చకులు ఐతపు రఘు శర్మ బాధితులని నందిగామకు పిలిపించి నందిగామ పట్టణ సిఐ ను సంప్రదించి పూర్తి వివరాలు తెలపగా పట్టణ సీఐ ఆదేశాల మేరకు నందిగామ వినాయకుడు ఆలయంలో చైర్మన్ తిరుపతిరావు ఆధ్వర్యంలో గొల్లమూడి శివాలయం ప్రధాన అర్చకులు చేతుల మీదుగా పోగొట్టుకున్న సొమ్ము నగదు 1 లక్ష రూపాయలు రాఘవపురం నివాసి అయిన వరద పైన మురళీకృష్ణ కు అప్పగించారు.

 

పోయిందనుకున్నా లక్ష రూపాయలు సొమ్ము తిరిగి వచ్చేసరికి అర్చకులు సాయిరాం నిజాయితీకి ఫిదా అయ్యాడు. నందిగామ పాత బస్టాండ్ వినాయకుడి గుడి ఆలయంలో భక్తులంతా సన్నివేశాన్ని చూసి సాయిరాం నిజాయితీకి ప్రశంసలు కురిపించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chintakrindi Sai Jyothi: టెక్నాలజీతో వైకల్యాన్ని జయించిన రచయిత్రి... ‘చేయి వీడని చెలిమి’ నవలను ఆవిష్కరించిన మంత్రి లోకేశ్.
దివ్యాంగ రచయిత్రి సాయిజ్యోతి నవల ఆవిష్కరించిన మంత్రి లోకేశ్ వాయిస్ ఇన్‌పుట్ టెక్నాలజీతో...
By Pagadala Venkateswar 2026-01-17 11:26:42 0 403
Telangana
వీళ్లే ఈ దేశానికి మార్గదర్శకులు ఈ తరానికి దిక్సూచులు
ఓ టీనేజ్ కుర్రాడు కరోనా వచ్చినప్పుడు అమెజాన్ లో ఏదో ఆర్డర్ పెడితే అది డిలే అయింది , 10 నిమిషాల్లో...
By Ponnala Srinivasrao 2026-05-16 03:35:29 0 179
Telangana
యువకుడిని నమ్మించి, దాదాపు 9 కోట్ల 85 లక్షల రూపాయల ఆర్థిక మోసానికి పాల్పడ్డా , బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి ?
  ‎నా భార్య వల్లే ఈ వ్యవహారమంతా.. డబ్బు తీసుకుంది వాస్తవమే: అషు తండ్రి ‎పెళ్లి...
By Ponnala Srinivasrao 2026-04-27 01:58:53 0 155
Andhra Pradesh
పన్నులు సకాలంలో చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ
పన్నులు సకాలంలో చెల్లిస్తే వడ్డీపై 50% వడ్డీ రాయితీ వస్తుందని కమిషనర్ ఎల్.రామలక్ష్మి...
By Boiena Rajesh 2026-03-21 11:54:00 0 279
Chandigarh
Political Heat: CM Mann Takes on Centre in Chandigarh
It’s a high-stakes Friday at the Punjab Raj Bhavan area as Chief Minister Bhagwant Mann...
By Dunna Jessicaruth 2026-05-15 09:34:00 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com