ఎన్టీఆర్ వైద్యసేవ: ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు షురూ.

0
132

ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు ప్రారంభం

'బిల్ డిస్కౌంటింగ్' విధానంలో రూ.1000 కోట్లు విడుదల

ఇప్పటికే 25 ఆసుపత్రులకు రూ. 62 కోట్ల చెల్లింపు పూర్తి

కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించిన మొత్తం రూ.5,556 కోట్లు

ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రులకు పేరుకుపోయిన బకాయిల చెల్లింపు ప్రక్రియను ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. 'ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్' (టీబీడీఏ) విధానంలో సుమారు రూ.1,000 కోట్లను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 25 ఆసుపత్రులకు రూ.62 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.

 

ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు, ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా ఈ చెల్లింపులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 323 ఆసుపత్రులు ఈ విధానం కింద దరఖాస్తు చేసుకున్నాయి. బకాయిల చెల్లింపు పురోగతిపై ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈఓ చక్రధర్ బాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు నివేదించారు.

 

ప్రస్తుతం 873 ప్రైవేటు ఆసుపత్రులకు కూటమి ప్రభుత్వం రూ.2,044 కోట్లు బకాయి పడింది. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.1,000 కోట్ల బిల్లుల పరిశీలన పూర్తి చేసి, చెల్లింపులు జరుపుతోంది. ఈ విధానంలో, ప్రభుత్వం తరఫున ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఏపీపీఎఫ్‌సీ) నిధులు చెల్లిస్తుంది. ఆసుపత్రులకు చెల్లించాల్సిన మొత్తంలో వార్షిక వడ్డీని ముందుగానే మినహాయించి, మిగిలిన మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తుంది.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు మొత్తం రూ.5,556 కోట్లు చెల్లించింది. గత వైకాపా ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.2,403 కోట్ల బకాయిలను కూడా ఇందులో భాగంగానే చెల్లించడం గమనార్హం. తాజా చెల్లింపులతో కలిపి ఆసుపత్రులకు మరింత ఊరట లభించనుంది.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
పజపాలన పరగతి ప్రాణాలిక కార్యక్రమo సిఎం రోడ్ ఆటోనగర్ లో నిర్వాహించారు ...
By Sadaq Sadaq 2026-06-08 06:18:19 0 147
Andhra Pradesh
శంఖవరంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు..
శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన కుట్టు మిషన్ సృష్టికర్త "విలియమ్స్...
By BABJI DADALA 2026-02-28 15:59:59 0 514
Andaman & Nikobar Islands
Maritime Hub: Galathea Bay Port Inches Closer
The ambitious ₹48,862 crore International Container Transshipment Port at Galathea Bay has moved...
By Dunna Jessicaruth 2026-05-14 09:25:07 0 214
Andhra Pradesh
ప్రజా దర్బార్ ప్రజల సమస్య పరిష్కార వేదిక టిడిపి కార్యాలయం యర్రగొండపాలెం నియోజకవర్గ
ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పరిష్కార వేదిక టిడిపి కార్యాలయం ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి...
By Chennaiah Kati 2025-12-27 09:10:02 0 467
Bharat Aawaz
Learning & Youth Empowerment........
From Learning to Leading: MY Bharat Volunteers in Action at India Post Office📮 From North to...
By Bharat Aawaz 2025-07-03 06:59:08 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com