పెట్రోల్, డీజిల్ కొరతతో బంకుల మూసివేత.. అధికారులకు సీఎం చంద్ర‌బాబు కీలక ఆదేశాలు.

0
118

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష

ప్యానిక్ కొనుగోళ్లతో 50 శాతానికి పైగా పెరిగిన డిమాండ్

సరఫరా లేక 400కు పైగా పెట్రోల్ బంకులు మూసివేత

ప్రజలు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశం

సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం డెడ్‌లైన్

రాష్ట్రంలో పలుచోట్ల పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడి బంకులు మూతపడుతున్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇంధన లభ్యత, సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీసి, కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

ఈ సందర్భంగా అధికారులు జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉండగా, సరఫరా సమస్యల కారణంగా దాదాపు 421 బంకులు మూతపడినట్లు తెలిపారు. కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటమే (ప్యానిక్ బయింగ్) ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు.

 

సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయని, కానీ శనివారం ఒక్కరోజే 10,345 కిలోలీటర్ల పెట్రోల్, 14,156 కిలోలీటర్ల డీజిల్ విక్రయాలు జరిగినట్లు అధికారులు వివరించారు. సాధారణంతో పోలిస్తే డిమాండ్ ఒక్కసారిగా 50 శాతానికి పైగా పెరగడంతో, సరఫరా 10 శాతం పెంచినప్పటికీ బంకుల్లో నిల్వలు వేగంగా అయిపోతున్నాయని తెలిపారు. దీంతో అనేక బంకుల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారని పేర్కొన్నారు.

 

ముఖ్యంగా ఆక్వా రంగంలో డ్రమ్ముల్లో ఇంధనం కొనుగోలు చేసేవారికి ఎదురవుతున్న సమస్యలను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన చంద్రబాబు, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులు కలిసి ఒక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో ఇంధన కొరత నివారణకు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై సాయంత్రం లోగా తనకు నివేదిక సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి పట్టణ వడ్డెర సంఘం నూతన కమిటీ ఎన్నిక.
మదనపల్లె పట్టణ వడ్డెర సంఘం నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బైపాస్ రోడ్డులోని...
By Pagadala Venkateswar 2026-06-12 10:56:32 0 123
Tamilnadu
"హాస్టల్ నిర్వాహకులపై దాడి: బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు!"
హైదరాబాద్ : మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య బొంతు శ్రీదేవిలపై పంజాగుట్ట పోలీస్...
By Sidhu Maroju 2026-05-21 11:54:42 0 181
Andhra Pradesh
తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం: టిటిడి విజ్ఞప్తి
తిరుమల శ్రీవారి వార్షిక గరుడసేవను పురస్కరించుకుని తిరుమలకు ద్విచక్ర వాహనాల (Two-Wheelers)...
By VALLERU SIMHADRI 2026-09-17 17:38:56 0 110
Andhra Pradesh
కోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్కు గవర్నర్ షాక్
Breaking:--   కోటి సంతకాల పేరుతో తప్పుడు ప్రచారం చేసిన జగన్‌కు గవర్నర్ షాక్!  ...
By Rajini Kumari 2025-12-19 11:05:03 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com