మహిళల అక్రమ రవాణాను అరికట్టండి

0
199

*మహిళల అక్రమ రవాణాను అరికట్టండి – వారి రక్షణను బలోపేతం చేయండి*

*- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ*

 

విజయవాడ స్థానిక రైల్వే ఇన్‌స్టిట్యూట్ హాల్‌లో శుక్రవారం మహిళల రక్షణపై ట్రాఫికింగ్‌ను అరికట్టండి- రక్షణను బలోపేతం చేయండి అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, పిల్లలను లైంగిక దోపిడీ కోసం అక్రమ రవాణా (ట్రాఫికింగ్) చేయడం ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందన్నారు. యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్ చర్యల ద్వారా ఈ సమస్యను అరికట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. బాధితులకు భరోసా కల్పించడం, వారికి రక్షణ కల్పించడం ఈ సమావేశం ముఖ్య లక్ష్యమని తెలిపారు. బాధితులతో, ముఖ్యంగా ట్రామాలో ఉన్న వారితో ఎలా మాట్లాడాలి, కేసులను ఎలా విచారించాలి, వారి నుంచి కీలక సమాచారాన్ని ఎలా సేకరించాలి వంటి అంశాలపై సమగ్రంగా ఈ కార్యక్రమంలో అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారన్నారు.

 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 126 ట్రాఫికింగ్ కేసులు నమోదయ్యాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పటికీ కేసుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. సాంకేతికతను ఎక్కువగా ఉపయోగించడంతోపాటు శక్తి (Shakti) యాప్, ఇతర డిజిటల్ సాధనాల ద్వారా నిందితులను త్వరగా గుర్తించడం, కేసుల విచారణను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు.

 

నిందితులకు శిక్ష పడేలా చేయడంలో (Conviction Rate) విభాగాల మధ్య సమన్వయం పెంచుకోవడం అవసరమని, ఉద్యోగాల పేరుతో, ప్రేమ పేరుతో జరిగే మోసాలు మరియు బలవంతపు కార్మికుల అక్రమ రవాణాను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్తత ద్వారా అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించవచ్చని, ఈ సమావేశం ద్వారా అధికారులకు ఉన్నతమైన దర్యాప్తు పద్ధతులు నేర్పడమే కాకుండా రాష్ట్రంలో కేసుల తీవ్రతను తగ్గించడంపై దృష్టి పెట్టామని చైర్‌పర్సన్ పేర్కొన్నారు.

 

ఆర్పీఎఫ్ ఎస్పీ షణ్ముఘం మాట్లాడుతూ... మాజీ ఐపీఎస్ అధికారి పి.ఎం. నాయర్ శిక్షకుడిగా వ్యవహరించి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశంలో రైల్వే డివిజనల్ మేనేజర్, ఆర్‌పీఎఫ్ (RPF), జీఆర్‌పీ (GRP), మహిళా అభివృద్ధి శాఖ (WCD), చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
పలుకూరు యువకుల హైటెక్ మోసం
పలుకూరు యువకుల హైటెక్ మోసం కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు హైదరాబాద్...
By Thalakayala Nagashiva 2026-05-05 06:14:32 0 335
Andhra Pradesh
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది
ఎమ్మిగనూరు పట్టణంలో ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నమస్తే ఎమ్మిగనూరు పోరుబాటు పోస్టర్...
By Boya Dasthagiri 2026-07-14 00:50:14 0 135
SURAKSHA
Empowering Our Force: Investing in Police Welfare & Growth
The Government’s commitment to the Union Territory is clearly reflected in the 2026-27...
By Lokeshwari Panthadi 2026-07-03 09:25:36 0 83
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో అద్భుత దృశ్యం
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని కట్టకింద శివాలయంలో గురువారం అద్భుత దృశ్యం...
By Kothuru Murali 2026-02-05 08:18:54 0 200
Telangana
D C C సూర్యాపేట జిల్లా కార్యదర్శి గా మాజీ సర్పంచ్ కొడారు లక్ష్మీనారాయణ నియామకం
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి కమిటీ నియామకములో చిలుకూరు గ్రామ మాజీ సర్పంచ్ ...
By Nookapangu Manikanta 2026-05-05 11:08:31 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com