"సూరారం పోలీస్ స్టేషన్‌లో 'స్మార్ట్' హంగులు: డీసీపీ ఎన్. కోటి రెడ్డి ప్రారంభం!

0
301

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి ఐపీఎస్, నేడు సూరారం పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన పలు సౌకర్యాలను ఘనంగా ప్రారంభించారు. 

విధుల్లో నిరంతరం నిమగ్నమయ్యే పోలీసు సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, మహిళా మరియు పురుష సిబ్బంది కోసం ప్రత్యేకంగా నిర్మించిన విశ్రాంతి గదులను ఆయన ప్రారంభించారు. 

వీటితో పాటు రికార్డుల భద్రత కోసం ఏర్పాటు చేసిన కోర్ట్ రికార్డు గదిని, సిబ్బంది శారీరక దృఢత్వం కోసం నిర్మించిన షటిల్ కోర్టును కూడా ఆయన ఆవిష్కరించారు.

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం మరియు వాటర్ ఫ్రిడ్జ్ సౌకర్యాలను డీసీపీ అభినందించారు. 

ఈ సందర్భంగా స్టేషన్‌లోని సీడీ ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి, కేసుల పురోగతిపై అధికారులకు కీలక సూచనలు చేశారు. 

శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఏసీపీ బాల గంగి రెడ్డి, జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ నర్సింహారావు, సూరారం ఎస్‌హెచ్‌ఓ సుధీర్ కృష్ణ తో పాటు ఎస్సైలు మురళి గౌడ్, కృష్ణ, రాజు, కిషన్, ఏఎస్సై శ్రీనివాస్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
పీఎం స్వానిధి పథకం ద్వారా మొదటి విడతలో 10000, రెండవ విడతలో 20000, మూడవ విడతలో 50,000 రూపాయలు లోను...
By Sadaq Sadaq 2026-06-16 05:49:01 0 138
Andhra Pradesh
దాడికి గురైన బాధితుడు తరుపున అండగా నిలబడ్డ బి సి నాయకులు... దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి...
By BABJI DADALA 2026-01-07 15:17:01 0 352
Telangana
గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ పై దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలి |
సికింద్రాబాద్ : మేడిపల్లి యంనం పేట్ వద్ద కాల్పులలో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న...
By Sidhu Maroju 2025-10-23 15:27:56 0 319
Telangana
బైరం చెరువుకు రక్షణ కవచం నిర్మించాలి- ప్రజావాణిలో వినతి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బాచుపల్లి పరిధిలోని బైరం చెరువు (పెద్ద చెరువు)...
By Sidhu Maroju 2025-12-29 15:46:07 0 238
Telangana
అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను చేదించిన సంగారెడ్డి జిల్లా పోలీసులు
సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్...
By Ponnala Srinivasrao 2026-05-05 09:29:39 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com