Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి: సీఎం చంద్రబాబు.

0
200

 

 

 

 

 

Chandrababu Naidu: నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి: సీఎం చంద్రబాబు

01-02-2026 Sun 22:28 | Andhra

Chandrababu Naidu Slams YSRCP Crime Politics Culture

వైసీపీ హయాంలో రాజకీయాలు నేరమయం అయ్యాయన్న చంద్రబాబు

తాము అధికారంలోకి వచ్చాక చట్టబద్ధ పాలన నెలకొల్పామని వెల్లడి

 

నిరాశ, నిస్పృహలతోనే వైసీపీ నేతలు తిట్లకు దిగుతున్నారని విమర్శ

శాంతిభద్రతలను ఉల్లంఘిస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టీకరణ

వైసీనీ రాజకీయాలు నేరమయం అయ్యాయని, వారి పాలనకు అరాచకమే నమూనాగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. 2024లో తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను తిరిగి నెలకొల్పామని ఆయన స్పష్టం చేశారు. నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి అని... ప్రజా సాధికారత, ప్రజాసేవ తమ ప్రభుత్వ సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు.

 

గతంలో వారు ధ్వంసం చేసిన ప్రతీదాన్నీ తమ ప్రభుత్వం తిరిగి నిర్మిస్తుండటాన్ని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చంద్రబాబు అన్నారు. వారి తప్పులు రోజురోజుకు బయటపడుతుండటంతో, నిరాశ, నిస్పృహలకు లోనై ప్రతిపక్షంలో ఉన్నా కూడా దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు.

 

అయితే, చట్టం అత్యున్నతమైనదని, తాము నెలకొల్పిన శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తేల్చిచెప్పారు. చట్టాన్ని, నియమాలను ఉల్లంఘించడానికి ఎవరినీ అనుమతించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Haryana
Arrested Across Three States for Allegedly Spying for Pakistan
Arrested Across Three States for Allegedly Spying for Pakistan New Delhi, – In the...
By BMA ADMIN 2025-05-22 05:41:33 0 3K
SURAKSHA
Goa Police Beach Safety Teams Save Tourists from Drowning Daily
 Goa Police Beach Safety Teams patrol Calangute, Baga and Miramar beaches to prevent...
By Kalaga Sailaja 2026-07-03 06:19:54 0 118
SURAKSHA
M. Raja Murugan IPS: A Leader Shaping Modern Policing
A distinguished 1996-batch IPS officer of the Tripura Cadre, M. Raja Murugan has earned respect...
By Lokeshwari Panthadi 2026-07-27 04:43:50 0 251
Andhra Pradesh
సమగ్ర శిక్షా కార్యాలయంలో ఉద్యోగాల భర్తీ
విజయనగరం సమగ్ర శిక్షా కార్యాలయంలో ఖాళీగా ఉన్న 8 సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ DEO&APC...
By Boiena Rajesh 2026-04-16 14:17:31 0 204
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం పరిధిలో శాంతినగర్ వద్ద కారు ఢీకొని ఐదేళ్ల చిన్నారి పరిస్థితి విషమం
పుంగనూరు మండలం, శాంతినగర్ సమీపంలో శుక్రవారం ఉదయం 42వ జాతీయ రహదారిపై మదనపల్లి నుంచి పుంగనూరుకు...
By Kothuru Murali 2026-02-20 10:58:31 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com