ప్రభుత్వ విద్యను విధ్వంసం చేస్తున్న కూటమి ప్రభుత్వం

0
246

అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కర్నూల్ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం స్థానిక సి ఆర్ భవనం నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి . వలరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణం బాధ్యులు బి. గిడ్డయ్య గారు హాజరయ్యారు ఈ సందర్భంగా విలేకరులతో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి వలరాజు మాట్లాడుతూ 

 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ప్రభుత్వ విద్యను పరిరక్షించాల్సిన బాధ్యత నుంచి క్రమంగా తప్పుకుంటూ చివరికి కూటమి ప్రభుత్వ హామీలను కూడా మరచిపోయి ప్రభుత్వ విద్యను ఉన్నత విద్యను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్లకు అందజేస్తున్నది అని అందువల్లనే ఏపీఎస్ సిహెచ్ఇ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ 

 నిబంధనలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం కమిషనరేట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ( సి హెచ్ ఈ) జీవో నెంబర్: 3 తీసుకోని వచ్చిందని 

 మరో పక్కన ఇంటర్మీడియట్ విద్యా మండలి మార్చి 18 వ తారీఖున ప్రైవేట్ కళాశాల ఎక్కడా కూడా బోర్డులను గాని వీడియోల ద్వారా ప్రచారం గానీ విద్యార్థులను కచ్చితంగా ఉత్తీర్ణులు చేస్తాం గాని ఇవ్వకూడదని ప్రవేట్ విద్యాసంస్థలకు ఇంటర్ విద్యా మండలి బోర్డు కార్యదర్శి పి రంజిత్ భాష తెలిపినప్పటికీ రాష్ట్రంలో ఏ ఒక్క కళాశాల పాటించకపోగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు పైగా కమీషనరేట్ ఆఫ్ ఫైర్ ఎడ్యుకేషన్ సిహెచ్ కమిషనర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఐఏఎస్ మార్చి 27వ తారీఖున ఫేక్ కోచింగ్ సెంటర్ లపై చర్యలు తీసుకుంటాము, అని 

ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సెంటర్లకు కొత్త నిబంధనలు తీసుకొని వచ్చారు అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఓ పక్క ప్రక్షాళన చేస్తున్నామంటూనే మరో పక్కన కార్పొరేట్ విద్యకు రెడ్ కార్పొరేట్ వేస్తున్నది అందుకు సందేహమే లేదు రాష్ట్రంలోని నకిలీ కోచింగ్ సెంటర్ల పై చర్యలు లేక

  విద్యార్థులను తల్లిదండ్రులని మభ్య పెట్టేందుకు మాత్రమే ప్రొసీడింగ్స్ విడుదల చేస్తూన్నారు అని అన్నారు 

 బైజూస్, ఫిజిక్స్ వాలా,ఎన్నో అనుమతి లేని సెంటర్ ఉన్న జేఈఈ మెయిన్స్ , మెడిసిన్ పేరుతో దోచుకున్న చర్యలు లేవు, అయినా కార్పొరేట్ విద్యకు పరోక్షంగా కూటమి నేతలు ఉతం అందుస్తున్న కూటమి ప్రభుత్వం ఇంకా ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తామంటూనే మభ్యపెడుతున్నారు, ఇంటర్ విద్యలో మొదటి సంవత్సరం 77% రెండవ సంవత్సరం 81% ఉన్న ఫెయిల్ కూడ అదే కార్పొరేట్ విద్యా సంస్థలో ఉన్న తల్లిదండ్రులకు, బయటకు, చెప్పకుండా ఉన్నారు ప్రాంతీయ ఆర్ఐవోలుగా వ్యవహరిస్తున్న వారు దీన్ని బయట పెట్టవలసిన అవసరం ఉన్న పట్టనట్టు ఉన్నారు, అదే క్రమంలో అడ్మిషన్లు అక్రమంగా చేస్తూ పుస్తకాల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కార్పొరేట్ల మంత్రిగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు ఇప్పటికి విద్యాశాఖ మంత్రి ఇచ్చిన హామీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విద్యార్థులు వేధింపులు గురి చేస్తున్నాయన్నారు విడుదల చేస్తామని చెప్పిన 1200 కోట్లలో కూడా ఇంకా పెండింగ్లో ఉండడం 2024 -2025 విద్యా సంవత్సరానికి చెల్లించకపోవడం వల్ల ప్రభుత్వ పెద్దల ఆదేశాలు వచ్చి నా విద్యార్థులకు కష్టాలు మాత్రం తప్పలేదు అని అన్నారు అందుకే ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిపి పోరాటాలకు సిద్ధమొద్దామని అన్నారు అనంతరం ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సోమన్న, యస్. షాబిర్ భాష, జిల్లా ఆఫీస్ బేరర్స్ శరత్ కుమార్, వీరేష్ నగర కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: విపక్షం లేకున్నా ఐదు కోట్ల ప్రజల కోసమే చర్చలు: సీఎం చంద్రబాబు.
15 రోజుల పాటు అసెంబ్లీలో చర్చలు జరిపినట్టు చంద్రబాబు వెల్లడి గత పాలకుల విధ్వంసం నుంచి ఏపీ...
By Pagadala Venkateswar 2026-03-06 09:36:48 0 197
Telangana
జెర్రీ పోతుల గూడెం AITUC కమిటీ ఎన్నిక
చిలుకూరు మండల కేంద్రానికి చెందిన, జెర్రిపోతులగూడెం గ్రామ AITUC నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది....
By Nookapangu Manikanta 2026-04-29 14:26:37 0 185
Telangana
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో రేషన్ కార్డుకు దరఖాస్తులు
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక'లో రేషన్ కార్డుకు దరఖాస్తులు! తెలంగాణ : రేవంత్ సర్కార్ నేటి నుంచి 99...
By Pinnehasan Odela 2026-03-06 06:46:07 0 244
Telangana
అసంపూర్తిగానే పోలీస్ స్టేషన్ భవనం , నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు
చిలుకూరు మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ 2017 లో కొత్త పోలీస్ స్టేషన్ మంజూరై స్టేషన్  కొరకు...
By Nookapangu Manikanta 2026-04-25 12:02:25 0 179
Telangana
గాదే ఇన్నారెడ్డి అరెస్ట్.|
     హైదరాబాద్ :  మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు అరెస్ట్...
By Sidhu Maroju 2025-12-21 11:54:18 0 246
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com