ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు : దుంపల రంజిత్ కుమార్

0
202

* మంచిర్యాల జిల్లా

* ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలి

* ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి - CITU 

* సమ్మె చేస్తున్న జేఏసీ నాయకులతో సమ్మె విరమణకు చర్యలు తీసుకోవాలి 

* ఆర్టీసీని ప్రైవేటికరణ చేస్తే ఊరుకోం 

* RTC కార్మికుల సమ్మెకు CITU సంపూర్ణ మద్దతు - *సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్

సీఐటీయు ఆధ్వర్యంలో గురువారం రోజున మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులకు సంఘిభావంగా తెలియచేస్తూ, ఆర్టీసీ సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ బస్టాండ్ ఎదుట నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా *సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్* మాట్లాడుతూ...కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడం చాలా దారుణమన్నారు. 

సమస్యలు పరిష్కరించాలని పలు దాఫాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు ఇచ్చిన ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె చేయడం జరుగుతుందన్నారు రాష్ట్ర కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసి బస్సులల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చింది.కాబట్టి పెరిగిన ప్రజల అవసరాల మేరకు ఆర్టీసి బస్ లు పెరుగుతాయని, దానికనుగుణంగా కార్మికుల సంఖ్య పెరుగుతుందని, కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశించాము.కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎం.వి.యాక్ట్-2019 మరియు విద్యుత్ బస్ ల విధానం వల్ల ఆర్టీసిలు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ బస్ వల్ల ఆర్టీసిలు కనుమరుగై, ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు మాత్రమే ఆర్టీసిలో మిగిలే పరిస్థితి వుంటుంది

      కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ బస్ల పథకాలన్నీ కూడా గ్రాస్కస్ట్ కాంట్రాక్ట్ (జిసిసి) పద్ధతిలో వుంటాయి. బస్ల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ అన్ని ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలే చూస్తాయి. ఆర్టీసిలకు ఎటువంటి పాత్ర వుండదు. ప్రతి నెలా ఆ విద్యుత్ బస్ల కంపెనీకి డబ్బులు చెల్లించడం మాత్రమే చేయాలి. అలాగే మౌలిక వసతుల కల్పన బాధ్యత మాత్రం ఆర్టీసి యాజమాన్యానిదే. హైదరాబాద్ నగర అనుభవం చూస్తే (పెంచిన మౌలిక వసతుల సెస్) రోజుకి సుమారు రూ.50 లక్షలు ప్రజలపై భారం పడ్తున్నది. ఇది భవిష్యత్లో మరింత పెరుగుతుంది.

. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ బస్ విధానంలో మార్పుచేయాలి. జిసిసి పద్ధతిని రద్దు చేయాలి. ప్రైవేటు సంస్థలకు ఇస్తున్న అన్ని సబ్సిడీలను ఆర్టీసిలకు ఇవ్వాలి. ఆర్టీసిలే నేరుగా విద్యుత్ బస్లు సమకూర్చుకొనేందుకు అవకాశం ఇవ్వాలి. బడ్జెట్లో నిధులు కేటాయించాలి.ప్రజల అవసరాల మేరకు బస్ సంఖ్యను పెంచాలి. పిఎమ్ఎ డ్రైవ్ పథకంలో ఇస్తున్న సబ్సిడీని ఆర్టీసి చేసే 'రెట్రో ఫిట్మెంటు' బస్లకు కూడా వర్తింప చేయాలి. ఆర్టీసి కార్మికుల ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సమ్మె చేస్తున్న జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమ్మె విరమణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సంకె రవి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, సాంబారి వెంకటస్వామి జిల్లా సహాయ కార్యదర్శి, గోమాస ప్రకాష్ జిల్లా కమిటీ సభ్యులు, పసుల తిరుపతి మండల కన్వీనర్, చిందం వెంకటేష్, చిప్పకుర్తి కుమార్, బానేష్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీకాకుళం: 'దళిత వ్యతిరేక తీర్పులను అడ్డుకోవాలి'
కులాంతర నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణయ్య గారు శ్రీకాకుళంలో జరిగిన కార్యవర్గ...
By Manda Ramkumar 2026-03-27 12:43:18 0 245
Goa
Goa Advances Water Resource Management for Sustainability
Goa is strengthening its water resource management strategy to ensure sustainable access to clean...
By Fathima Safa 2026-06-25 12:41:59 0 152
Gujarat
Ahmedabad Hosts Global Tech & Medical Summits This July
Ahmedabad is set to become a global hub for innovation this July, as the city prepares to host a...
By Lokeshwari Panthadi 2026-07-01 06:41:56 0 116
Andhra Pradesh
చింతూరు ఐటిడిఏ ముందు గిరిజనుల ధర్నా!
పోలవరం జిల్లా కేంద్ర రంపచోడవరంలో ఈరోజు  గిరజన చట్టాల సాధనకై జరుగుతున్న మహాగర్జన సభకు...
By Shyamala Yadagiri 2026-07-20 06:59:43 0 194
Andhra Pradesh
పుంగనూరు :పుంగనూరు కొత్తూరు మురళిలో ఐదు దశాబ్దాల చరిత్ర గల జాతర నేటి నుంచి ప్రారంభం
పుంగునూరులో మంగళ, బుధవారాలలో ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన సుగుటూరు గంగమ్మ జాతర అత్యంత వైభవంగా...
By Kothuru Murali 2026-03-10 15:42:20 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com