"సైరన్ వేసినా.. రాంగ్ సైడ్ వెళ్లినా చల్లానే: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్!

0
232

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి ట్రాఫిక్ జోన్-1 పరిధిలో రాంగ్ సైడ్ డ్రైవింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్ మరియు అనధికార సైరన్ల వినియోగాన్ని అరికట్టడానికి పోలీసులు ఈరోజు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 

ఈ తనిఖీల్లో భాగంగా మొత్తం 1786 రాంగ్ సైడ్ కేసులు, 4 అనధికార సైరన్ వినియోగం కేసులు నమోదు చేసి, వాహనదారులకు రూ. 22,01,800 జరిమానా విధించారు.

ముఖ్యంగా ప్రధాన కూడళ్లు మరియు ప్రమాదకర ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. అనధికారికంగా సైరన్లు వాడుతూ పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఈ సందర్భంగా మల్కాజిగిరి ట్రాఫిక్ డిసిపి-1, కె. రాహుల్ రెడ్డి, ఐపిఎస్ మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాలని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల ప్రాణాంతక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సైరన్ల దుర్వినియోగాన్ని ఏమాత్రం సహించబోమని, రోడ్లపై క్రమశిక్షణ కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
బంగారమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి
బొబ్బిలి మండలం కొత్తపెంటలో బంగారమ్మ తల్లి ఆలయం నూతనంగా నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని...
By Boiena Rajesh 2026-02-25 13:22:15 0 323
Telangana
"గోల్కొండ అమ్మవారికి బోనం ఎత్తిన ఈటల రాజేందర్".|
"బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక వేడుక:...
By Sidhu Maroju 2026-07-16 08:03:10 0 170
Andhra Pradesh
మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు: సీఐ సుబ్బరాయుడు
అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో...
By Kothuru Murali 2026-06-04 14:42:13 0 138
Telangana
భయం లేని ట్రాక్టర్ డ్రైవర్స్
కులస్పూర్ గ్రామం లో యాదేచ్చగా కేజ్వెల్స్ తో సీసీ రోడ్ల పైనే టాక్ట్రాస్ నడుపుతున్నారు. ప్రభుత్వం...
By Chakrala Sadhanand 2026-08-04 05:14:26 0 395
Andhra Pradesh
భూముల ఆక్రమణపై ఏఐసీసీకి ఫిర్యాదు..
కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో మల్లంపేట నిరుపేద రైతులకు కేటాయించిన సాగు భూములను కొందరు పెద్దలు...
By Boiena Rajesh 2026-02-26 15:41:49 0 251
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com