"గోల్కొండ అమ్మవారికి బోనం ఎత్తిన ఈటల రాజేందర్".|

0
164

"బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక వేడుక: ఈటల"

హైదరాబాద్. గోల్కొండ జూలై 16: ఆషాఢ మాసం బోనాల పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు గురువారం గోల్కొండ కోటలోని శ్రీశ్రీశ్రీ జగదంబ మహంకాళి అమ్మవారిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. వందల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక సంప్రదాయం తెలంగాణ ప్రజల విశ్వాసానికి ప్రతిబింబమని పేర్కొన్నారు.

"వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి బోనాన్ని గోల్కొండ అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అనంతరం లష్కర్ బోనాలతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో బోనాలు సమర్పిస్తారు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనూ బోనాల వేడుకలు నిర్వహిస్తారు" అని ఈటల రాజేందర్ తెలిపారు.

ప్రజలు అమ్మవారిని దర్శించుకుని కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని మొక్కుకుంటారని ఆయన అన్నారు. భూతల్లి, వ్యవసాయం, వ్యాపారాలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి తెలంగాణ పాడిపంటలతో అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటారని తెలిపారు.

తరతరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అందించడంలో గోల్కొండ బోనాల జాతర కీలక పాత్ర పోషిస్తోందని ఈటల రాజేందర్ అన్నారు. 

ప్రతి సంవత్సరం కమిటీ ఆధ్వర్యంలో కుమ్మర సోదరులు, వివిధ వర్గాల ప్రజలు కలిసి ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయన బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Manipur
Landslides and Floods Cause Major Disruptions in Manipu
Landslides and Floods Cause Major Disruptions in Manipur - Relentless rainfall in Manipur has led...
By Bharat Aawaz 2025-07-17 07:13:52 0 1K
Andhra Pradesh
సుపరిపాలన దినోత్సవం సందర్భంగా వాజ్పేయికి ఘన నివాళులు అర్పించిన గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు
సుపరిపాలన దినోత్సవం’ సందర్భంగా వాజ్‌పేయికి ఘన నివాళులు అర్పించిన గవర్నర్ శ్రీ అబ్దుల్...
By Rajini Kumari 2025-12-25 11:09:07 0 286
Andhra Pradesh
ప్రేమ వివాహ జంటను వేరు చేశారని ఎస్పీకి ఫిర్యాదు.
అన్నమయ్య జిల్లా, ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లెకు చెందిన ముక్కండ్ల వినోద్ కుమార్, కొత్తకోట...
By Pagadala Venkateswar 2026-03-27 04:04:49 0 194
SURAKSHA
Ravindra Singh Yadav: Leading Andaman Police Forward
A distinguished AGMUT cadre IPS officer, Ravindra Singh Yadav serves as the Director General of...
By Lokeshwari Panthadi 2026-07-24 06:39:17 0 218
Telangana
గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి cc రోడ్డు ప్రారంభం
తలకొండపల్లి మండలం లోని పడకల్ గ్రామంలో సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి చేసే అభివృద్ధి లో...
By MERIGE MALLESH 2026-03-28 09:59:04 0 424
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com