రేవంత్ రెడ్డికి పాడను‎ఇక తన జర్నీ బాపు కెసిఆర్ తోనే ‎: గాయని మధుప్రియ

0
166

బాపు కెసిఆర్ తెలంగాణకొక ఎమోషనల్ అని, ప్రతి ఇంట, ప్రతి హృదయంలో కెసిఆర్ ఉన్నారని గాయని మధుప్రియ అన్నారు. ఎటు చూసినా కూల్చివేతలు, కరెంట్ కష్టాలు, రైతుల ఇక్కట్లు మినహా ఈ ప్రభ్యత్వంలో ఇంకేం కనిపించడం లేదని, మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సోమవారం జగిత్యాల బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన మధుప్రియ మీడియాతో మాట్లాడారు.

‎భారీ సభలో తాను పాడి రెండేళ్లు అయ్యిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అవకాశాలు రాలేదని మధుప్రియ తెలిపారు. తాను తెలంగాణ ఉద్యమంలో బాపు కెసిఆర్ తో జర్నీ చేసి ఎన్నో సభల్లో పాడానని, తనను సొంతబిడ్డలా చూసుకుంటారని ఆమె అన్నారు.  రేవంత్ రెడ్డి సభలకు పాడే సమస్య లేదని, ఇక తన ప్రయాణం కెసిఆర్ తోనే అని ప్రకటించారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, తెలంగాణ ఉద్యమంలో ధూమ్ ధామ్ లో పాడిన అనుభవం, సకల జనుల సమ్మెలో పాల్గొన్న జ్ఞాపకం అన్నీ తనలో తెలంగాణ భావోద్వేగం ఇమిడి ఉందని, ఏ ప్రభుత్వంలోనైనా తెలంగాణ బిడ్డలకు మంచి జరగాలనే కోరుకుంటున్న అని ఆమె అన్నారు. తనను వివాదాల్లోకి లాగొద్దని మధుప్రియ కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పంచాయతీరాజ్ శాఖ‌లో ప్రమోషన్ల పండగ.. కీలక ఆదేశాలు జారీ చేసిన పవన్.
  పంచాయతీరాజ్ శాఖ‌లో ప్రమోషన్ల పండగ.. కీలక ఆదేశాలు జారీ చేసిన పవన్ 26-06-2026...
By Pagadala Venkateswar 2026-06-26 05:28:48 0 101
Andhra Pradesh
రూ.66 లక్షలతో నాలుగు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
రూ.66 లక్షలతో నాలుగు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం గిద్దలూరు నియోజకవర్గం,...
By Chennaiah Kati 2026-07-14 11:10:08 0 110
Telangana
సదర్ సమ్మేళన ఉత్సవాలు: పాల్గొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  తన నియోజకవర్గం లోని బొల్లారం,...
By Sidhu Maroju 2025-10-21 18:01:54 0 323
Andhra Pradesh
పరీక్ష సామాగ్రి పంపిణీ: విద్యార్థినులకు రేషన్ డీలర్ల చేయూత.
మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులకు అన్నమయ్య జిల్లా రేషన్...
By Pagadala Venkateswar 2026-02-24 07:14:55 0 178
Telangana
మోదీకి సహస్రనామంతో శుభాకాంక్షలు.|
● నవ కుంకుమలతో సహస్రనామార్చనలో ఈటల రాజేందర్ ● ప్రధాని ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు ●...
By Sidhu Maroju 2026-09-19 14:04:02 0 54
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com