రేవంత్ రెడ్డికి పాడను‎ఇక తన జర్నీ బాపు కెసిఆర్ తోనే ‎: గాయని మధుప్రియ

0
167

బాపు కెసిఆర్ తెలంగాణకొక ఎమోషనల్ అని, ప్రతి ఇంట, ప్రతి హృదయంలో కెసిఆర్ ఉన్నారని గాయని మధుప్రియ అన్నారు. ఎటు చూసినా కూల్చివేతలు, కరెంట్ కష్టాలు, రైతుల ఇక్కట్లు మినహా ఈ ప్రభ్యత్వంలో ఇంకేం కనిపించడం లేదని, మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సోమవారం జగిత్యాల బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు వచ్చిన మధుప్రియ మీడియాతో మాట్లాడారు.

‎భారీ సభలో తాను పాడి రెండేళ్లు అయ్యిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అవకాశాలు రాలేదని మధుప్రియ తెలిపారు. తాను తెలంగాణ ఉద్యమంలో బాపు కెసిఆర్ తో జర్నీ చేసి ఎన్నో సభల్లో పాడానని, తనను సొంతబిడ్డలా చూసుకుంటారని ఆమె అన్నారు.  రేవంత్ రెడ్డి సభలకు పాడే సమస్య లేదని, ఇక తన ప్రయాణం కెసిఆర్ తోనే అని ప్రకటించారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, తెలంగాణ ఉద్యమంలో ధూమ్ ధామ్ లో పాడిన అనుభవం, సకల జనుల సమ్మెలో పాల్గొన్న జ్ఞాపకం అన్నీ తనలో తెలంగాణ భావోద్వేగం ఇమిడి ఉందని, ఏ ప్రభుత్వంలోనైనా తెలంగాణ బిడ్డలకు మంచి జరగాలనే కోరుకుంటున్న అని ఆమె అన్నారు. తనను వివాదాల్లోకి లాగొద్దని మధుప్రియ కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చిన్న తిప్ప సముద్రంలో జాతీయ సైన్స్ దినోత్సవం.
మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని...
By Pagadala Venkateswar 2026-02-28 10:54:55 0 193
Andhra Pradesh
CBN Meets deputy CM
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల పవన్...
By G k Nookala 2026-05-02 14:18:54 0 208
Andhra Pradesh
సూర్య, శాంసన్ కాదు.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కొంపముంచేది ఇతనే..! ముందే ఓటమిని శాసించిన విలన్
Team India T20I World Cup 2026 Squad: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీం ఇండియా...
By SivaNagendra Annapareddy 2026-01-20 08:20:42 0 662
Telangana
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం.....!
జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం: పొంగులేటి భారత్ అవాజ్ న్యూస్: 13 మే రోజున...
By Gujile Ramu 2026-05-13 04:53:07 0 142
Andhra Pradesh
అమరావతి వైద్య ఆరోగ్యశాఖ పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
*అమరావతి : వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష.*   *గేట్స్...
By Rajini Kumari 2025-12-16 07:07:54 0 264
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com