హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా..

0
241

పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్..

‎హరీష్ రావును విమర్శించే స్థాయి నీదా వసూల్ రాజా..

‎అభివృద్ధి నినాదం మాది.. అవినీతి చరిత్ర నీది..

‎మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుల్లెట్ దించిన బుద్ధి రాలేదు..

‎మంత్రి కుమార్తె వివాహం ఖర్చుల పేరుతో కోట్ల రూపాయల వసూళ్లు నిజం కాదా..

‎సొంత కుటుంబాన్ని ద్రోహం చేసిన చరిత్ర నీది..

‎నీ స్వార్థం కోసం కన్న తల్లిని సైతం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించావు కదా..

‎మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అమ్ముకున్నది నిజం కాదా..

‎ఎన్నికలు వస్తే నీకు పండగే కదా.. రేటు కట్టి మరీ బీఫాంలు అమ్ముకోవడం మీకు అలవాటే కదా..

‎రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గల్లికో కలెక్షన్ ఏజెంట్ పెట్టి వసూలు చేయడం అబద్ధమా..

‎గత రెండున్నర సంవత్సరాలలో నీ వసూల్ చిట్టా విప్పమంటావా కాటా. 

‎అమీన్పూర్ సర్పంచ్ గా ప్రజలు నమ్మి గెలిపిస్తే.. రెండేళ్లలో రిమూవ్ అయ్యావు.. గుర్తులేదా..

‎ఒక సర్పంచ్ పదవిని పూర్తి కాలం పనిచేయలేని అసమర్థుడు కాటా శ్రీనివాస్ గౌడ్..

‎నమ్ముకున్న ప్రజల కోసం వందల ఎకరాలు అమ్ముకున్న చరిత్ర నాది..

‎గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే బహిరంగ విచారణకు సిద్ధం..

‎ మైనింగ్ కేసులపై పూర్తి వివరణ

‎2012 లో పటాన్చెరు మండల రెవెన్యూ పరిధిలోని లకడారం గ్రామంలో సర్వే నంబర్ 738 లో సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లై పేరుతో No.439/QL/2010 ప్రభుత్వ ప్రొసీడింగ్స్ తో 2012 లో 15 సంవత్సరాల లీజు తో ప్రారంభించడం జరిగింది.

‎మా సంస్థకు క్వారీ కేటాయించిన భూమిలో అప్పటికే ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ జాతీయ రహదారి కోసం పెద్ద ఎత్తున మైనింగ్ చేయడం జరిగింది. అప్పట్లోనే ఈ విషయాన్ని సంబంధిత మైనింగ్ శాఖ అధికారుల సైతం తెలపడం జరిగింది. అనంతరం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా క్వారీని నడపడం జరిగింది.

‎2023 సంవత్సరంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2024 లో కేవలం రాజకీయ కక్షతో అనుమతికి మించి మైనింగ్ చేస్తున్నారంటూ నిబంధనలకు విరుద్ధంగా సీజ్ చేయడం జరిగింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 520 కి క్రషర్ క్వారీలకు సైతం నోటీసులు అందించారు.

‎కేవలం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడి క్వారీ అన్న కక్షతో నిబంధనలను తుంగలో తొక్కి.. క్వారీ ప్రతినిధులు లేకుండానే.. అడ్డగోలుగా సర్వే నిర్వహించి 300 కోట్ల రూపాయల జరిమానా విధించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. 

‎ఈ అంశంపై ఫిజికల్ గా రీ సర్వే నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టుకి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం విజ్ఞప్తి చేయడం జరిగింది.

‎రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రీ సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసిన.. నేటి వరకు రీ సర్వే చేయలేదంటే దాని వెనక ఎవరు ఉన్నారో ప్రజలు అర్థం చేసుకోవచ్చు.

‎ పటాన్చెరు రెవెన్యూ పరిధిలోని పోచారం సర్వే నంబర్ 62 లో గల 5 ఎకరాలకు సంబంధించిన పూర్తి వివరాలు. 

‎1. 1974 సంవత్సరంలో వెంకటేశ్వర్లు అనే స్వాతంత్ర సమరయోధుడికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుని కోటా కింద పోచారం పరిధిలోని సర్వే నంబర్ 62లో 5 ఎకరాలు కేటాయించడం జరిగింది.

‎2. 1997 సంవత్సరంలో వెంకటేశ్వరరావు గారు తన ఐదు ఎకరాలను శంకర్ లాల్ గారికి విక్రయించడం జరిగింది. 

‎3. 1998 నుండి శంకర్ లాల్ గారు ఈ ఐదు ఎకరాలను వివిధ వ్యక్తులకు విక్రయించడం జరిగింది. 

‎ఈ భూమికి సంబంధించి మాకు గాని మా కుటుంబ సభ్యుల గాని ఎటువంటి సంబంధం లేదు. మరోసారి ఈ అంశంపై వివాదాస్పద ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేయడం జరుగుతుంది

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించడం జరిగింది.
ఎమ్మిగనూరు పట్టణంలోని గురు నవోదయ కోచింగ్ యాజమాన్యం పై కేసు నమోదు చేయాలి అని సోమప్ప సర్కిల్లోని...
By Boya Dasthagiri 2026-07-06 14:48:01 0 153
Bihar
Bihar Expands Rural Road Connectivity for Better Access
The Bihar government is accelerating rural road connectivity projects to improve transportation,...
By Fathima Safa 2026-06-24 06:21:18 0 111
Andhra Pradesh
దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు.
"దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు 30-04-2026 Thu 22:49 | Andhra AP...
By Pagadala Venkateswar 2026-05-01 04:15:15 0 137
Telangana
నిజామాబాద్: ఉచిత కన్ టి వైద్యశిబిరం
నగరంలోని ఇందిరా ప్రియదర్శిని నగర్ కాలనీలోని .సూర్యసమైక్య సంఘం లో జనసేన 12 వ ఆవిర్భావం సందర్బంగా...
By Sadaq Sadaq 2026-03-14 09:26:40 0 233
Andhra Pradesh
2026 ఫిబ్రవరి నెలలో సుమారు 40 లక్షల 20 వేల రూపాయల విలువైన 201 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన ప్రత్యేక బృందం బాధితుల మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అందించేందుకు జిల్లాలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం
బాపట్ల జిల్లా: 100 శాతం మొబైల్ ఫోన్ లను రికవరీ చెయ్యడమే లక్ష్యంగా, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను...
By Gadiyapudi Narendra 2026-03-17 11:45:34 0 948
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com