Bharat Aawaz

"ఆపరేషన్ సేఫ్ స్కూల్… హైదరాబాద్‌లో 558 దుకాణాలపై సజ్జనార్ భారీ దాడులు”

Sidhu Maroju
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
2.1K
Views

హైదరాబాద్ : నగరంలో స్కూల్ పరిసరాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు “ఆపరేషన్ సేఫ్ స్కూల్” పేరుతో భారీ స్థాయి తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ V. C. Sajjanar ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో దాదాపు 5000 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ పరిసరాల్లో ఉన్న పాన్ షాపులు, సిగరెట్ మరియు ఇతర టొబాకో ఉత్పత్తులు విక్రయించే దుకాణాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

సుమారు 558కి పైగా దుకాణాలు తనిఖీ చేసినట్లు సమాచారం. ఇందులో స్కూల్ జోన్ నిబంధనలు ఉల్లంఘించిన అనేక కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న ఘటనలు కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

పిల్లలను పొగాకు వ్యసనానికి దూరంగా ఉంచడం, స్కూల్ పరిసరాలను సురక్షితంగా మార్చడం ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని హెచ్చరించారు.

ఈ చర్యతో స్కూల్ జోన్‌లలో నిబంధనలు మరింత పటిష్టం అవుతాయని, విద్యార్థుల భద్రతకు ఇది కీలక అడుగు అని పోలీసులు పేర్కొన్నారు.

#sidhumaroji