మంచిర్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో విజిలెన్స్ అధికారుల తనిఖీ
Posted 2026-04-18 04:07:43
0
216
మంచిర్యాల సబ్ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కార్యాలయంలో శుక్రవారం కరీంనగర్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రికార్డులను పరిశీలించారు. భూ క్రయవిక్రయాల విషయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో విచారణ చేపట్టినట్లు సమాచారం. సేకరించిన నివేదికను సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు పేర్కొన్నారు.ఈ మేరకు విజిలెన్స్ దాడులు జరుగుతాయని ముందస్తు సమాచారం మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆవరణలోని డాక్యుమెంట్ రైటర్స్ తమ కార్యాలయాలను మూసివేశారు. ఈ దాడుల్లో ఐవోపీలు అనిల్ కుమార్, వరుణ్ ప్రసాద్, ప్రశాంత్ రావు, రవీందర్, ఎమ్మార్వో లు దినేష్ చంద్ర, శ్రీనివాస్, ఏజీ వెంకట్ రెడ్డి, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి వేడుకల్లో : మంచిర్యాల మేయర్, డిప్యూటీ మేయర్
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు,సామాజిక కార్యకర్త,మహిళా విద్య, కుల నిర్మూలన, సామాజిక...
పోలీసునని నమ్మించి కారు కజేసిన యువకుడు
BHARAT AAWAZ న్యూస్
పోలీసునని నమ్మించి కారు కాజేసిన యువకుడు
కళ్యాణదుర్గం, తాను...
యాంకి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
సూర్యమోహన్ దౌల్తాబాద్ రిపోర్టర్
యాంకి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
వడ్డే...
Haryana Strengthens Employment and Entrepreneurship Drive
Haryana continues to promote employment and entrepreneurship through skill development programs,...
Heatwave Safety: Heat Exhaustion vs. Lethal Heat Stroke
As record-breaking summer heatwaves intensify following the solstice, major medical...