మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ అడ్మిషన్ల సందడి

0
404

 

సూర్యమోహన్, మద్దూరు మండలం రిపోర్టర్

 

 

మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ అడ్మిషన్ల సందడి

 

 

కోడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దోస్త్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.ఈ నెల 15న మొదలైన దరఖాస్తుల గడువు మే7వరకు కొనసాగుతుందని ప్రిన్సిపల్ బి కృష్ణారెడ్డి తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.కళాశాలలో బీఏ, బీకామ్,బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ (ఎంపీసీఎస్,బీజెడ్‌సీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు,ప్రభుత్వ స్కాలర్‌షిప్,ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు మీ-సేవా కేంద్రాల ద్వారా లేదా దోస్త్ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఇతర వివరాలకు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని కళాశాల ప్రిన్సిపాల్ సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్‌ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నరసరావు పేట లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు
ఆర్‌ ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నరసరావు పేట లో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ...
By Chennaiah Kati 2026-06-18 13:12:31 0 114
SURAKSHA
Romil Singh Donk: Leading Leh with Vision and Service
A dynamic IAS officer of the AGMUT cadre, Romil Singh Donk serves as the Deputy Commissioner of...
By Lokeshwari Panthadi 2026-07-30 05:33:20 0 133
Andhra Pradesh
ఏపీ ఆరోగ్య సూచన సలహాదారుడిగా డాక్టర్ మంతెన సత్యనారాయణ
*ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా డా.మంతెన సత్యనారాయణ రాజు*   ప్రముఖ ప్రకృతి వైద్య రంగ నిపుణులు...
By Rajini Kumari 2025-12-30 10:28:08 0 241
Telangana
కాంగ్రెస్ నాయకుడు ఆరోగ్య పరిస్థితిపై రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకుర్
గోదావరిఖని యువజన కాంగ్రెస్ నాయకుడు తిప్పారపు శ్రీనివాస్ గుండెపోటుతో గురికావడంతో హుటాహుటిన...
By Thalakokkula Sadanandam 2026-04-12 02:03:57 0 606
Andhra Pradesh
బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
మదనపల్లె పట్టణంలోని బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో నీళ్లు మోయిస్తున్న ఘటనపై విమర్శలు...
By Pagadala Venkateswar 2026-04-08 05:40:16 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com