అమర్‌నాథ్‌కు నాంది.|

0
99

"పవిత్ర గుహలో ప్రథమ పూజ.. ఈసారి కూడా హెలికాప్టర్లు బంద్."

హైదరాబాద్ :జమ్మూ కాశ్మీర్‌లోని పవిత్ర అమర్‌నాథ్ గుహ వార్షిక యాత్రకు సోమవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ప్రథమ పూజతో శ్రీకారం చుట్టారు. 

శాస్త్రోక్తంగా జరిగిన ఈ ప్రత్యేక పూజలో ఆలయ పూజారులు, శ్రైన్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో 2026 అమర్‌నాథ్ యాత్రకు అధికారికంగా నాంది పలికినట్లైంది. 

జూలై 3 నుంచి భక్తులకు యాత్ర ప్రారంభం కానుండగా, దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఇప్పటికే నమోదు చేసుకుని దర్శనానికి సిద్ధమవుతున్నారు.

ఈసారి యాత్రలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కేంద్రం, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. 

యాత్ర జరిగే పహల్గామ్, బాల్టాల్ మార్గాలను 'నో-ఫ్లై జోన్'గా ప్రకటించడంతో భక్తుల కోసం నిర్వహించే హెలికాప్టర్ సేవలను పూర్తిగా రద్దు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయంతో వరుసగా రెండో ఏడాది కూడా హెలికాప్టర్ సదుపాయం లేకుండానే యాత్ర కొనసాగనుంది.

యాత్ర మార్గాల వెంట భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో పాటు డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, ఆధునిక నిఘా వ్యవస్థలతో నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. భక్తులు అధికారులు సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని యాత్ర చేయాలని అధికారులు సూచించారు. 

హెలికాప్టర్ సేవలు లేకపోవడంతో భక్తులు సంప్రదాయ పహల్గామ్ లేదా బాల్టాల్ మార్గాల ద్వారా కాలినడకన లేదా గుర్రాలు, పల్లకీలు, పీఠూ సేవలను వినియోగించి పవిత్ర గుహకు చేరుకోవాల్సి ఉంటుంది.

#Sidhumaroju

Search
Categories
Read More
BMA
Compound Trauma: Fact-Checkers Reliving Endless Crises
The relentless news cycle has created a perfect storm for newsroom burnout. Indian fact-checkers...
By JoinBMA 2026-08-21 11:35:29 0 368
Technology
సైన్స్ అంశాలపై అవగాహన పెంచుకోవాలి: జేవీవీ రాష్ట్ర సభ్యులు షేక్ జాఫర్
భారత్ అవాజ్ | హుజూర్‌నగర్   విద్యార్థులు చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని...
By Malla Rambabu 2026-07-18 01:32:03 0 280
Telangana
పేదల భూములపై ఆంక్షలా.. ప్రభుత్వంపై ఈటల ఫైర్.|
● 22-A బాధితులకు అండగా ఇందిరాపార్క్‌లో బీజేపీ మహా దీక్ష ● అర్హులైన భూములను నిషేధిత జాబితా...
By Sidhu Maroju 2026-09-05 11:43:18 0 156
Andhra Pradesh
Retired Police Officer 's wellfare Association. Vijayawada , Gandhinagar.
రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ అధ్వర్యంలో ఈరోజు ఉదయం గాంధీనగర్ లోని...
By Kokkiligadda Suresh 2026-04-14 08:52:53 0 476
Andhra Pradesh
మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో సర్ ప్రోగ్రాం
మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో సర్ ప్రోగ్రాంలో జరుగుతున్న ఎన్యుమరేషన్,డిజిటలైజేషన్...
By Chennaiah Kati 2026-07-12 13:19:52 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com