Direct train from srikakulam road to tirupati

0
400

ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక చారిత్రాత్మకమైన రోజు. నేడు శ్రీకాకుళం రోడ్ – తిరుపతి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ (17439/40)ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. 75 సంవత్సరాల జిల్లా చరిత్రలో తొలిసారిగా తిరుపతికి నేరుగా రెగ్యులర్ ట్రైన్ సేవ ప్రారంభం కావడం ద్వారా ఎన్నో ఏళ్ల ప్రజల కల సాకారం అయ్యింది.

 

ఈ రైలు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్రక్షేత్రంతో అనుసంధానం చేస్తూ, భక్తులకు యాత్రను మరింత సులభతరం, సౌకర్యవంతంగా చేస్తుంది.

 

ఈ సందర్భంగా ప్రయాణికులతో కూడా మాట్లాడి, ఈ కొత్త ట్రైన్ సేవపై వారి సంతోషం మరియు సానుకూల స్పందన వినడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.

 

ఈ సేవ వేలాది మంది భక్తులకు వేగవంతమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే కాకుండా, ప్రాంతీయ అనుసంధానం మరియు అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.

 

ఈ నూతన రైలు ప్రారంభించడానికి సహకరించిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 

కూటమి ఎన్‌డీఏ డబల్ ఇంజిన్ ప్రభుత్వం లో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. ఈ కార్యక్రమంలో వాల్తేర్ DRM శ్రీ లలిత్ బోహ్రా గారు, అమదాలవలస ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ గారు, శ్రీకాకుళం ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ గారు, రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా ప్రజలు పాల్గొన్నారు. 

ఇది కేవలం ఒక ట్రైన్ సేవ మాత్రమే కాదు శ్రీకాకుళం ప్రజల ఆశలు మరియు అభివృద్ధిని అనుసంధానించే ఒక కీలక ముందడుగు.

Search
Categories
Read More
Telangana
కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి బీఆర్‌ఎస్‌ కీలక నేత ఫోన్‌!టీఆర్‌ఎస్‌ పేరును ఎలా ఇస్తారు?
కవిత ప్రకటించిన కొత్త పార్టీని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ నాయకత్వం పావులు...
By Ponnala Srinivasrao 2026-04-30 03:15:43 0 166
Andhra Pradesh
సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో.
  సీఎం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మక అవార్డు... ముంబైలో.  Andhra CM Chandrababu will...
By Pagadala Venkateswar 2026-04-25 05:11:18 0 124
Andhra Pradesh
కేఎల్ యూనివర్సిటీ గుంటూరు యువజన ఉత్సవాలు ముగింపు
(ఫర్ స్క్రోలింగ్)   KL యూనివర్సిటీ గుంటూరులో యువజనోత్సవల ముగింపు వేడుక సందర్భంగా..  ...
By Rajini Kumari 2025-12-20 12:58:04 0 199
Sports
రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ ఎంపిక విధానాన్ని పరిశీలించిన సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి
ఈ రోజు స్పోర్ట్స్ స్కూల్ హకింపేట్‌లో జరుగుతున్న అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా, స్టేట్ లెవెల్...
By Avunoori Mahesh 2026-05-01 08:59:26 0 241
Andhra Pradesh
పుంగనూరు: కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ అధికారిగా యశ్వంత్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద ఉన్న టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ...
By Kothuru Murali 2026-04-18 09:33:16 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com