Arrive Alive లో భాగంగా హెల్మెట్ల పంపిణీ - "పోలీసులు మీకోసం"లో ఆదివాసి మహిళలకు కుట్టు మిషన్లు

0
184

కుమురం భీమ్ జిల్లా కేరమేరి మండలం జోడేఘాట్‌లో ఆదివాసి వీరుడు కొమురం భీం విగ్రహానికి రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి జిల్లా పోలీస్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మ్యూజియం సందర్శించారుఅనంతరం నిర్వహించిన “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా 1000 మంది ద్విచక్ర వాహనదారులకు నాణ్యమైన హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ బి. శివధర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి, స్వయంగా వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ప్రతి వాహనదారుడికి ప్రాణ రక్షక కవచమని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం అత్యంత అవసరమని సూచించారు.అదేవిధంగా “పోలీసులు మీకోసం” కార్యక్రమంలో భాగంగా 50 మంది ఆదివాసి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, పోలీస్ శాఖ ప్రజల భద్రతతో పాటు వారి సంక్షేమం కోసం కూడా కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆదివాసి మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.కార్యక్రమం అనంతరం ఆదివాసి కళాకారులు సంప్రదాయ దింసా, గుస్సాడి నృత్యాలను ప్రదర్శించగా, డీజీపీ వాటిని ఆసక్తిగా వీక్షించి కళాకారులతో కలిసి ఫోటోలు దిగారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ నితికా పంత్, ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్, వాంకిడి సీఐ సత్యనారాయణ, కేరమేరి ఎస్సై మధుకర్ తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
The Scholar-Cop: Dr. Sudhanshu Sarangi’s Vision for Modern Policing
Bridging Intellect and Enforcement: The Inspiring Odyssey of an IPS Stalwart:In the demanding...
By Kalaga Sailaja 2026-07-18 05:34:42 0 166
Andhra Pradesh
క్రిస్మస్‌ సందర్భంగా చీరాల మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు గారు  శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్‌ సందర్భంగా చీరాల మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైఎస్సార్...
By Gadiyapudi Narendra 2025-12-24 17:27:23 0 286
Andhra Pradesh
మాధవపట్నం వంతెన వద్ద రోడ్డు ప్రమాదం – మహిళకు తీవ్ర గాయాలు
సామర్లకోట మండలంలోని మాధవపట్నం వంతెన సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా...
By Ratna Sekhar 2026-02-19 14:26:16 0 482
Andhra Pradesh
డెబిట్ కార్డ్ డీ-యాక్టివేషన్ పేరుతో రూ. 2. 94 లక్షలు స్వాహా.
మదనపల్లె మండలం పొన్నెటిపాలేనికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వాసాల భాగ్యలక్ష్మిని ఐసీఐసీఐ బ్యాంక్...
By Pagadala Venkateswar 2026-05-29 05:23:50 0 100
Andhra Pradesh
అంబటి రాంబాబు పై కేసు నమోదు.
AP: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని...
By Pagadala Venkateswar 2026-01-31 12:04:06 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com