*_కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు._*

0
186

_ఆయన అధికారంలో లేకపోవచ్చు.. కానీ ఆయన మాటకు ఉన్న పవర్ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.._పనులు పరుగులు పెడతాయని సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ సాక్షిగా తేలిపోయింది. "సారు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు" అని విమర్శించే ప్రత్యర్థులకు, "ఆయన ఎక్కడున్నా శాసించగలరు" అని కేసీఆర్ తన స్టైల్‌లో సమాధానమిచ్చారు._

‎_సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని కొట్యాల, అల్లీనగర్, అడవి మజీద్, క్షీరసాగర్ వంటి గ్రామాల్లో వందలాది ఎకరాల పంట పొలాలు నీరు లేక కళ్లముందే ఎండిపోతున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి, ఆలేరు కాలువలకు నీటిని వదులుతున్నా.. తమ గ్రామాల కాలువలకు మాత్రం నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, విసిగిపోయిన రైతులు డీసీసీబీ మాజీ డైరెక్టర్ అంజిరెడ్డిని ఆశ్రయించారు._

‎_రైతుల కష్టాన్ని విన్న అంజిరెడ్డి నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్‌ను కలిశారు. ఎండిపోతున్న పంటల ఫోటోలను చూసిన కేసీఆర్, క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. "రైతు కంట కన్నీరు రాకూడదు.. పంటలు ఎండిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? వెంటనే నీటిని విడుదల చేయండి" అంటూ తనదైన శైలిలో సూచించారు._

‎*_హుటాహుటిన పరుగులు పెట్టిన యంత్రాంగం!_*

‎_ఆశ్చర్యకరంగా.. కేసీఆర్ ఫోన్ చేసిన కాసేపటికే అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. అప్పటివరకు సవాలక్ష కారణాలు చెప్పిన అధికారులు, మాజీ సీఎం ఆదేశాలతో వెంటనే అలర్ట్ అయ్యారు. హుటాహుటిన కొండపోచమ్మ సాగర్ నుంచి కాలువలకు నీటిని విడుదల చేశారు. కాలువల్లో నీరు ఉరకలెత్తుతుంటే రైతుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది._

‎*_సోషల్ మీడియాలో వైరల్:_*

‎_ఈ ఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారంలో లేకపోయినా కేసీఆర్ ఒక ఫోన్ కాల్‌తో యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "సీఎం సీటులో ఉన్నా లేకున్నా.. కేసీఆర్ క్రేజ్ వేరు" అంటూ ఆయన అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఫామ్ హౌస్ నుంచే పాలనను శాసించగల సత్తా ఆయనకు ఉందని ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది. తమ పంటలను కాపాడిన కేసీఆర్‌కు ఆయా గ్రామాల రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు._

 

Search
Categories
Read More
Rajasthan
Rajasthan Tragedy: Four Good Samaritans Killed While Assisting Accident Victims in Dungarpur
Jaipur/Dungarpur: In a heartbreaking turn of events, four people lost their lives and eight...
By BMA ADMIN 2025-05-20 06:54:11 0 3K
Haryana
Haryana Cracks Down on Illegal Abortions: Two Doctors' Licenses Suspended, Three Arrested in Gurugram
Haryana Cracks Down on Illegal Abortions: Two Doctors' Licenses Suspended, Three Arrested in...
By BMA ADMIN 2025-05-22 05:31:01 0 2K
Telangana
మంచిర్యాల నియోజకవర్గం రైతులను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం మాదరిపేట్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-04-29 11:54:40 0 207
Andhra Pradesh
హార్మూస్ జల సంధిలో తీవ్ర ఉద్రిక్తతచుట్టుముట్టిన అమెరికా
Iran       *హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరాన్‌ను చుట్టుముట్టిన...
By Rajini Kumari 2026-04-13 08:04:00 0 150
International
Global Realignment: Quad Summit & Putin’s Beijing Visit
Significant diplomatic realignments are reshaping global geopolitics. In New Delhi, Quad Foreign...
By Dunna Jessicaruth 2026-05-26 08:25:08 0 604
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com