గాయని మంగ్లీ కేసుతో నాకు ‎ఎలాంటి సంబంధం లేదు"

0
205

ఆర్థిక మోసం ఘటనలో గాయని మంగ్లీపై నమోదైన కేసులో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఉన్నారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. ఈ అసత్య వార్తలపై వివరణ ఇచ్చారు దర్శకుడు వేణు ఊడుగుల. మంగ్లీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు దర్శకుడు వేణు ఊడుగుల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.వేణు ఊడుగుల స్పందిస్తూ - "గాయని మంగ్లీ కేసులో నా పేరును చేర్చుతూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న వార్తలు చూసి బాధపడ్డాను. మంగ్లీ, లాయర్ సుబ్బారావు ఇద్దరూ నాకు తెలిసిన వాళ్లు కావడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలని సూచించాను. ఇంతవరకే ఈ కేసులో నా పాత్ర. ఈ కేసు ఎఫ్ఐఆర్ లో కూడా నిందితుడిగా నా పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అడ్వకేట్ సుబ్బారావు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వేణు ఊడుగులకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. పంజాగుట్ట పోలీసులు కూడా ఈ కేసుతో నాకు సంబంధం లేదని నిర్థారించారు. మీ వార్తల వల్ల ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ట, కుటుంబం ప్రభావితం అవుతాయని మీడియా మిత్రులు గమనించగలరు. మీరు నాపై ఇంతకాలం చూపిన ప్రేమ, ఆదరణ నాకెంతో బలాన్నిచ్చాయి. ఇప్పుడూ అదే ప్రేమను కొనసాగిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన మార్కాపురం జిల్లా పోలీసులు
ప్రజల సమస్యల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని...
By Chennaiah Kati 2026-07-22 15:30:03 0 250
Andhra Pradesh
ఫిల్దర్ఫియా ఏజీ చర్చ్ ను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్
*ప్ర‌చుర‌ణార్థం* *29-12-2025*   ఫిల‌దెల్ఫియా ఎ.జి చ‌ర్చ్ ను...
By Rajini Kumari 2025-12-29 09:28:05 0 212
Delhi - NCR
MeitY Grills WhatsApp, Signal on Usernames & Security
The Ministry of Electronics and Information Technology (MeitY) has escalated its regulatory...
By Lokeshwari Panthadi 2026-07-03 06:32:36 0 85
Telangana
గోదావరిలో నీళ్లు లేకపోతే.. పోలవరంలో రోడ్లు ఎలా కొట్టుకుపోతాయి? రేవంత్ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలు!
గోదావరి నదిలో అసలు నీటి ప్రవాహమే లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలకు,...
By Ponnala Srinivasrao 2026-07-09 01:46:55 0 180
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు...
By Kothuru Murali 2026-03-05 05:16:57 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com