ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల

0
332

రాష్ట్రంలో ఆదివారం(ఏప్రిల్ 12) ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది._

 

_ఇంటర్ ఫలితాల సమయం, వేదిక శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు._

 

_అయితే గతంతో పోలిస్తే ఈ సారి అత్యంత వేగంగా బోర్డు ఫలితాలను విడుదల చేయనుంది. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసే లక్ష్యంతో మార్చి మొదటి వారం నుంచే బోర్డు జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించి వేగంగా ప్రక్రియ పూర్తి చేసింది. గతంలో సాధారంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఇంటర్ ఫలితాలు చేసేవారు. ఈసారి మాత్రం గతంలో కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు._

 

*_ఈసారి త్వరగా అడ్వాన్స్‌డ్ పరీక్షలు_*

 

_ఇంటర్ ఫలితాలు ఈసారి త్వరగా విడుదల చేస్తున్న నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు త్వరగా నిర్వహించి విద్యాసంవత్సరం ప్రారంభం లోపే ఫలితాలు ప్రకటించనున్నారు. తద్వారా ఇంటర్ తర్వాత ప్రవేశాలు పొందే ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ కోర్సులలో విద్యార్థులు సకాలంలో ప్రవేశాలు పొందనున్నారు._

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రైనేజ్ కాలువ పనులు వెంటనే ఆపాలి – జేసీకి సిపిఐ ఫిర్యాదు.
మదనపల్లి టమోటా మార్కెట్ నుంచి బ్రహ్మంగారి గుడి వరకు నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువ పనులను వెంటనే...
By Pagadala Venkateswar 2026-01-28 10:09:14 0 183
Andhra Pradesh
గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రతా ఏర్పాట్లు చేపట్టిన గుంటూరు జిల్లా పోలీస్ శాఖ.
గుంటూరు  తేదీ 05.02.2026 న తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపూడి గ్రామం వద్ద, ఎంఎల్ఏ...
By John Baji 2026-02-05 02:42:15 0 542
Telangana
‎నా కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టకండి: డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందిపెట్టడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు....
By Ponnala Srinivasrao 2026-05-07 02:13:38 0 148
Andhra Pradesh
సింగపూర్ లో చంద్రబాబుకు టాప్ ప్రోటోకాల్... వీడియో ఇదిగో!
  సింగపూర్ లో చంద్రబాబుకు టాప్ ప్రోటోకాల్... వీడియో ఇదిగో!   Andhra Chandrababu...
By Pagadala Venkateswar 2026-06-16 04:35:27 0 78
Telangana
రైతులు సోలార్ విద్యుత్ ను ఉపయోగించుకోవాలి
చిలుకూరు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే విద్యుత్ ను రైతులు ఉపయోగించుకోవాలని కోదాడ ఏడిఈ...
By Nookapangu Manikanta 2026-05-07 12:56:15 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com