సింగపూర్ లో చంద్రబాబుకు టాప్ ప్రోటోకాల్... వీడియో ఇదిగో!

0
75

 

సింగపూర్ లో చంద్రబాబుకు టాప్ ప్రోటోకాల్... వీడియో ఇదిగో!

 

Andhra

Chandrababu Naidu gets massive convoy in Singapore as PM Lawrence Wong provides top protocol

సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అగ్రస్థాయి ప్రొటోకాల్

పోలీస్ ఎస్కార్ట్‌తో భారీ కాన్వాయ్‌ను ఏర్పాటు చేసిన సింగపూర్ ప్రభుత్వం

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో 30 నిమిషాల పాటు కీలక చర్చలు

అమరావతి పురోగతిపై ఆసక్తిగా అడిగి తెలుసుకున్న సింగపూర్ ప్రధాని

గూగుల్, పలు వెంచర్ క్యాపిటలిస్టులతో ఏపీలో పెట్టుబడులపై చర్చలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్ పర్యటనలో ఆ దేశ ప్రభుత్వం టాప్ ప్రోటోకాల్ తో అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ వెళ్లిన ఆయనకు భారీ భద్రత, పోలీస్ ఎస్కార్ట్‌తో కూడిన కాన్వాయ్‌ను ఏర్పాటు చేయడం పర్యటన ప్రాధాన్యతను తెలియజేస్తోంది. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ తో సమావేశానికి వెళ్లేటప్పుడు, ఆ సమావేశం ముగిశాఖ సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి బాలకృష్ణన్ తో సమావేశానికి వెళ్లేటప్పుడు కూడా చంద్రబాబుకు భారీ కాన్వాయ్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు కాన్వాయ్ లో టయోటా వెల్ ఫైర్, మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ వాహనాలు ఉండడం విశేషం. సాధారణంగా ఓ దేశాధినేతకు మాత్రమే ఇలాంటి ప్రోటోకాల్ తో భారీ కాన్వాయ్ ఏర్పాటు చేస్తుంటారు.

 

కాగా, తన పర్యటనలో భాగంగా సోమవారం, చంద్రబాబు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో ఆయన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, పట్టణ పాలన, వాణిజ్యం వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అమరావతి పురోగతిపై లారెన్స్ వాంగ్ ఆసక్తిగా అడిగి తెలుసుకోగా, దానిని అంతర్జాతీయ ప్రమాణాలతో నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు వివరించారు.

 

అంతకుముందు, భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే, గూగుల్ క్లౌడ్ ఆసియా-పసిఫిక్ ప్రెసిడెంట్ కరణ్ బజ్వా, పలు వెంచర్ క్యాపిటలిస్టులతో చంద్రబాబు సమావేశమయ్యారు. డిజిటల్ గవర్నెన్స్, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుపై గూగుల్‌తో చర్చించారు. రాష్ట్రంలోని 1053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని పోర్టులు, షిప్‌బిల్డింగ్, రక్షణ రంగ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Search
Categories
Read More
SURAKSHA
The Architect of Modern Policing: The Inspiring Journey of Dr. Shankhabrata Bagchi, IPS
A Guardian of Justice: Redefining Public Service Through Strategy and Empathy In the fast-paced...
By Kalaga Sailaja 2026-07-13 11:18:11 0 131
Andhra Pradesh
Pawan Kalyan: కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంతో బిడ్డను కోల్పోయానన్న మహిళ... స్పందించిన పవన్ కల్యాణ్.
Andhra Pawan Kalyan Responds to Womans Loss of Baby Due to KGH Negligence కేజీహెచ్ వైద్యుల...
By Pagadala Venkateswar 2026-01-31 10:26:59 0 218
Andhra Pradesh
Gold Price Drop: కొనసాగుతున్న బంగారం ధరల పతనం... ఈరోజు రూ.9 వేలు ఢమాల్
Gold Price Down | బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. తులం బంగారం రూ.9 వేలు పడిపోతే, కిలో...
By Siva Bhaskar 2026-02-02 04:49:42 0 717
Telangana
నిజామాబాద్: పెదమతల్లి విగ్రహం ప్రతిష్ఠాపనలో పలుగొన్న మాజీ ఎమ్మెల్యే బిగలగణేష్ గుప్త
తేదీ:23.04.2026 నిజామాబాద్.ముదిరాజుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో...
By Sadaq Sadaq 2026-04-23 07:37:36 0 167
SURAKSHA
: Bengaluru Police Plant Trees For Green Bengaluru
 As part of environmental protection, Bengaluru Police today led a massive tree plantation...
By Kalaga Sailaja 2026-07-06 06:43:59 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com