ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల

0
333

రాష్ట్రంలో ఆదివారం(ఏప్రిల్ 12) ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది._

 

_ఇంటర్ ఫలితాల సమయం, వేదిక శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు._

 

_అయితే గతంతో పోలిస్తే ఈ సారి అత్యంత వేగంగా బోర్డు ఫలితాలను విడుదల చేయనుంది. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసే లక్ష్యంతో మార్చి మొదటి వారం నుంచే బోర్డు జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించి వేగంగా ప్రక్రియ పూర్తి చేసింది. గతంలో సాధారంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఇంటర్ ఫలితాలు చేసేవారు. ఈసారి మాత్రం గతంలో కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు._

 

*_ఈసారి త్వరగా అడ్వాన్స్‌డ్ పరీక్షలు_*

 

_ఇంటర్ ఫలితాలు ఈసారి త్వరగా విడుదల చేస్తున్న నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు త్వరగా నిర్వహించి విద్యాసంవత్సరం ప్రారంభం లోపే ఫలితాలు ప్రకటించనున్నారు. తద్వారా ఇంటర్ తర్వాత ప్రవేశాలు పొందే ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ కోర్సులలో విద్యార్థులు సకాలంలో ప్రవేశాలు పొందనున్నారు._

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య సమక్షంలో టిడిపిలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి.  ...
By Gadiyapudi Narendra 2026-01-10 16:40:05 0 297
West Bengal
NCPI Rises as 20 Rebel TMC MPs Shift Bengal Allegiance
An unprecedented political shakeup has upended West Bengal following the aftermath of the state...
By Lokeshwari Panthadi 2026-06-25 12:15:22 0 93
Andhra Pradesh
ఎర్నాకుళం వెళ్లే రైలులో అనకాపల్లి దగ్గర అగ్నిప్రమాదం ఒకరు మృతి రెండు ఏసీ బోగీలు దగ్ధం
*Train Fire: అనకాపల్లి దగ్గర రైలులో అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు దగ్ధం.. ఒకరు మృతి*  ...
By Rajini Kumari 2025-12-29 08:36:02 0 364
West Bengal
West Bengal Enhances Border Security and Trade Ties
West Bengal continues to strengthen border security and deepen cooperation with Bangladesh...
By Fathima Safa 2026-07-02 05:52:28 0 101
Andhra Pradesh
అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ హెచ్చరిక.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల...
By Pagadala Venkateswar 2026-03-12 05:36:57 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com