ఘనంగా జ్యోతిరావు పూలే కు నివాళి

0
206

బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన బహుజన సమాజ్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జ్ గుదే రాజారావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానీయ సామాజిక సంస్కర్త 199వ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించబడిందని,పార్టీ నాయకులు,కార్యకర్తలు కలిసి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించామని తెలియజేశారు.అనంతరం బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి నల్లమోతు సామెల్ జాన్సన్ మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే సామాజిక సమానత్వం,విద్యా విస్తరణ, దళిత-బహుజన హక్కుల కోసం చేసిన పోరాటం ఈ రోజుకీ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళా విద్యకు పునాది వేసి, అణగారిన వర్గాల అభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో బహుజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శీలం రోజెన్ బాబు, నియోజవర్గ మహిళా అధ్యక్షురాలు పాలపర్తి సంతమ్మ,సంజీవరావు, తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు*.

Search
Categories
Read More
Andhra Pradesh
లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికి పోలీస్ అధికారి
పోలవరం జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ లో వరుసగా అవినీతికి పాల్పడుతూ ఏసీబీ కి పట్టుబడుతున్న...
By Shyamala Yadagiri 2026-03-18 04:08:11 0 310
Andhra Pradesh
త్వరలో గరుడ పథకం ఏపీలో.
రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల కోసం త్వరలో ‘గరుడ’ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా...
By Pagadala Venkateswar 2026-01-13 12:03:47 0 255
Andhra Pradesh
రెండు గంటల్లోనే మిస్ అయిన ఫోన్ గుట్టు రట్టు చేసిన ఎస్‌ఐ మానిక
సామర్లకోట మున్సిపల్ కార్యాలయం చెట్టిరింగ్ ప్రాంతంలో రమేష్ అనే వ్యక్తి పెదపురం–సామర్లకోట...
By Ratna Sekhar 2026-02-13 14:38:28 0 394
Telangana
వివాహ వేడుకలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల పట్టణంలోని అమ్మ గార్డెన్ లో మనస్విని-ఆదిత్య మణికంఠ వివాహ వేడుకలకు హాజరై దంపతులను...
By Avunoori Mahesh 2026-04-26 12:30:56 0 166
Andhra Pradesh
ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు కన్నుమూత.
ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ పద్యకవి, 'పద్యభారతి' బిరుదాంకితులు చదలవాడ లక్ష్మీనరసింహారావు (90)...
By Pagadala Venkateswar 2026-04-13 05:54:58 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com