ట్రెండ్ ను ఫాలో కావొద్దు... సవాళ్లను స్వీకరించండి: బెంగళూరులో నారా లోకేశ్.

0
151

యువత సవాళ్లను స్వీకరించి ముందుకు సాగాలని, ట్రెండ్‌ను అనుసరించకుండా నిర్దిష్ట లక్ష్యంపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. బెంగళూరులోని సర్జాపూర్‌లో ఉన్న గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ (గ్రేడ్-12) 2026 గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.

 

షార్ట్‌కట్‌లతో నిండిన ప్రస్తుత ప్రపంచంలో నైతికతే గొప్ప బలమని లోకేశ్ అన్నారు. "కేవలం ఏం నేర్చుకున్నారన్నది కాకుండా, ఎలా ఆలోచిస్తున్నారనేదే అత్యంత ముఖ్యం. ఎవరూ చూడనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది" అని విద్యార్థులకు హితవు పలికారు. లక్ష్య సాధనలో పట్టుదలతో ఉండాలని, ఎదురయ్యే అడ్డంకులను అవకాశాలుగా మార్చుకోవాలని సూచించారు.

 

ఈ పర్యటన సందర్భంగా మంత్రి లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడుస్తోందని, త్వరలోనే ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధిలో భాగస్వామ్యం కాబోతోందని వెల్లడించారు. గ్రీన్‌వుడ్ హై స్కూల్ అంతర్జాతీయ స్థాయిలో పౌరులను (గ్లోబల్ సిటిజన్స్) తయారు చేస్తుండటం గర్వకారణమని ఆయన ప్రశంసించారు.

 

అంతకుముందు, పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేశ్ కు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్కూల్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆర్ట్ గ్యాలరీ, తరగతి గదులను సందర్శించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన లోకేశ్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించి, వారితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఆనందోత్సాహలాలు మునిగిపోయిన ప్రజలు
టీ-20 ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించడంతో పుంగనూరు నియోజకవర్గంలోని మండలాల్లోని ప్రజలు, క్రికెట్...
By Kothuru Murali 2026-03-09 08:11:28 0 189
Andhra Pradesh
#petrol yuddam
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో పెట్రోల్ యుద్దం వాహనదారులు ఇబ్బందులు
By Kokkiligadda Suresh 2026-04-27 08:24:08 0 750
Telangana
ప్రజల కష్టాలు - సివరేజ్ పనులకు శ్రీకారం చుట్టిన కార్పొరేటర్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
By Sidhu Maroju 2026-02-10 13:06:06 0 219
Haryana
Haryana Strengthens Employment and Entrepreneurship Drive
Haryana continues to promote employment and entrepreneurship through skill development programs,...
By Fathima Safa 2026-07-03 04:50:34 0 126
Telangana
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్...
By Sidhu Maroju 2025-06-02 10:23:36 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com