75 ఏళ్ల నిరీక్షణకు తెర.. శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు, ఏప్రిల్ 13న ప్రారంభం,

0
444

జిల్లా ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. జిల్లా చరిత్రలోనే 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభం కానుంది.

విషయాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇది మనందరికీ గర్వకారణమంటూ అచ్చెన్నాయుడు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం 17439/40 హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి ఈ రైలు సర్వీసును ప్రారంభించనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.

 

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛను గుర్తించి, ప్రత్యేక చొరవ చూపించి రైల్వే శాఖతో సమన్వయం చేసుకుంటూ ఈ రైలు సర్వీసు మంజూరులో కీలక పాత్ర పోషించినందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు.. అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పథంలో ఇదొక చరిత్రాత్మక ఘట్టంగా అచ్చెన్నాయుడు అభివర్ణించారు. మరోవైపు తిరుపతి - శ్రీకాకుళం రోడ్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు (17439) ప్రతి ఆదివారం తిరుపతి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయల్దేరుతుంది. సోమవారల మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. ఇక శ్రీకాకుళం - తిరుపతి హంసఫర్ ఎక్స్‌ప్రెస్ (17440) ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రైల్వే్ స్టేషన్‌ నుంచి బయల్దేరుతుంది. మంగళవారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది

.

 

References

Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం తో మదనపల్లి అభివృద్ధిపై చర్చించిన ఎమ్మెల్యే.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సీఎం చంద్రబాబు నాయుడును...
By Pagadala Venkateswar 2026-02-24 07:36:44 0 193
Bihar
Bihar Advances Education and Skill Development Drive
Bihar is strengthening its education and skill development ecosystem through expanded learning...
By Fathima Safa 2026-07-01 08:45:31 0 187
Andhra Pradesh
కడివెళ్ల గ్రామానికి చర్చి ఓపెనింగ్ లో బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిర్మించిన చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమంలో...
By Boya Dasthagiri 2026-05-04 13:44:38 0 153
Andhra Pradesh
గుంటూరు జీజీహెచ్‌లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మానస యువతిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ శుక్రవారం పరామర్శించాను.
గుంటూరు జీజీహెచ్‌లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మానస యువతిని రాష్ట్ర మహిళా...
By Gadiyapudi Narendra 2026-01-10 12:17:17 0 366
SURAKSHA
Pranab Jyoti Goswami IPS: Leading Assam With Integrity
A dedicated IPS officer of the Assam-Meghalaya Cadre, Pranab Jyoti Goswami has built a...
By Lokeshwari Panthadi 2026-08-03 13:05:15 0 245
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com