అంబేద్కర్ విగ్రహం: తిరిగి ప్రతిష్టించకపోతే కేసులు – బక్కి వెంకటయ్య.|

0
246

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్  వాల్మీకి నగర్‌లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉద్రిక్తతలకు దారి తీసింది. విగ్రహాన్ని యథావిధిగా తిరిగి ప్రతిష్టించకపోతే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గట్టిగా హెచ్చరించారు.

శుక్రవారం వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్ ముందు నుంచి తొలగించిన అంబేద్కర్ విగ్రహం, కూల్చివేసిన గద్దె పరిసరాలను బక్కి వెంకటయ్య స్వయంగా పరిశీలించారు. 

అనంతరం బస్తీ వాసులు, సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. విగ్రహాన్ని కంటోన్మెంట్ బోర్డు అధికారులు తొలగించారని స్థానికులు వివరించగా, వెంటనే స్పందించిన కమిషన్ చైర్మన్ కంటోన్మెంట్ బోర్డు ఇంజనీర్ ఫణికుమార్‌కు ఫోన్ చేసి సోమవారం లోపు విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని ఆదేశించారు.

అలా చేయకపోతే కఠిన చర్యలు తప్పవని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా మల్కాజ్‌గిరి డీసీపీ శ్రీధర్‌ను సంప్రదించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

“ఏప్రిల్ నెల మహనీయుల పండుగల నెల. అలాంటి సమయంలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం, గద్దె కూల్చివేయడం తీవ్ర అవమానం” అని బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. అధికారులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.

అధికారులు స్వాధీనం చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని తక్షణమే తిరిగి ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్యతో పాటు పలువురు దళిత నాయకులు, బస్తీ ప్రజలు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
జూన్ 2 నుంచి కొత్త పెన్షన్స్ మంత్రి వివేక్ చెప్పడం జరిగింది....!
జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్ భారత్ అవాజ్ న్యూస్: 18 మే రోజున తెలంగాణ మంత్రివర్గ...
By Gujile Ramu 2026-05-18 03:22:06 0 174
Telangana
నిజామాబాదు చంద్రనగర్ లో బంగారం చోరీ
నిజామాబాదు చంద్రనగర్ లో ఒక షాప్ కి విక్స్ కావాలి అంటూ వచ్చి బంగారం చోరీ చేసాడు ... ఈ చోరీ సి.సీ...
By Sunka Santhosh 2026-04-04 18:50:09 0 340
Andhra Pradesh
హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. ఇకపై వేగంగా గ్రీన్‌కార్డుల ప్రక్రియ*
* తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు...
By SivaNagendra Annapareddy 2025-12-23 06:33:51 0 276
Telangana
తెలంగాణలో ఏం జరుగబోతున్నది?
దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది....
By Ponnala Srinivasrao 2026-03-25 03:32:03 0 230
Andhra Pradesh
మార్చి 9న 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహణ
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమాన్ని మార్చి 9న సోమవారం...
By Vadlamudi NagaVenkat 2026-03-06 14:51:55 0 640
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com