తిరుమలగిరిలో జ్ఞాన దీపం.. నూతన గ్రంథాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
228

సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలో విద్యార్థులు, యువతకు జ్ఞానాన్ని అందించే దిశగా కీలక ముందడుగు పడింది. నేటి తరానికి గ్రంథాలయాల ప్రాముఖ్యత అపారమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేర్కొన్నారు.

తిరుమలగిరి లాల్ బజార్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక గ్రంథాలయాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ గ్రంథాలయం ద్వారా విద్యార్థులు, యువతకు అవసరమైన సమాచారం, విషయ పరిజ్ఞానం సులభంగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయిన్‌పల్లి, బొల్లారంలలో కూడా త్వరలోనే గ్రంథాలయాల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

గ్రంథాలయంలో అన్ని ఆధునిక వసతులు కల్పించామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా, తన సొంత నిధులతో అధ్యాపకులను మార్గదర్శకులుగా నియమించి యువతకు మెరుగైన భవిష్యత్తు అందించే ప్రణాళికలో ఉన్నట్లు తెలిపారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
SURAKSHA
Vikas Kumar IPS: Steering Ladakh with Courage and Vision
A 2013-batch AGMUT cadre IPS officer, Vikas Kumar has emerged as one of Ladakh's most trusted...
By Lokeshwari Panthadi 2026-07-29 06:43:28 0 192
Telangana
జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
అల్వాల్ డివిజన్ లోని  జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2025-07-14 12:47:11 0 1K
Telangana
ప్రతి పేదవాడి సొంత ఇంటి కలలను నెరవేర్చడమే నా లక్ష్యం: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి పేదవాని సొంత ఇంటి కలలను నెరవేర్చడమే తన లక్ష్యమని...
By Sidhu Maroju 2025-06-12 12:22:54 0 1K
Andhra Pradesh
వృద్ధురాలిపై కండక్టర్ దురుసు ప్రవర్తన
చిత్తూరు జిల్లా పుంగనూరులో మదనపల్లి ఆర్టీసీ బస్సులో శుక్రవారం కండక్టర్ దురుసు ప్రవర్తన కలకలం...
By Kothuru Murali 2026-04-11 05:39:52 0 158
Andhra Pradesh
చిన్నగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం గ్రామలలో దేవాలయాలను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారు
బాపట్ల జిల్లా:  చిన్నగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం గ్రామలలో దేవాలయాలను  సందర్శించిన...
By Gadiyapudi Narendra 2026-02-12 13:05:09 0 224
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com