వేసవిలో నీటి కొరత లేకుండా "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం

0
667

  -మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్

WARANGAL/NARSAMPET: నేడు మున్సిపల్ యంత్రాంగంతో 19వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్ గారు & స్థానిక వార్డు కౌన్సిలర్ ఎలుకంటి విజయ్ గారు..ఈ సందర్భంగా వారు గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను, మంచినీటి, డ్రైనేజ్,పారిశుద్ధ వ్యవస్థను పర్యవేక్షించి..అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు..

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ.

- మున్సిపల్ సిబ్బంది సైడ్ డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను & రోడ్డుకి ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని,పారిశుద్ధం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు..- 19వ వార్డులో నీటి సౌకర్యాన్ని పరిశీలించి..ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో బోర్లు వేయించడం జరిగిందని వాటికి మోటర్లు కూడా అమర్చడం జరిగిందని..వేసవికాలంలో వార్డులోని ప్రజలకు ఎలాంటి నీటి కొరత లేకుండా & ఇబ్బందుల తలెత్తకుండా చూస్తామని "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం చేస్తున్నామని అన్నారు..అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే ఆహార నాణ్యత,వంట గదుల శుభ్రత మరియు తాగునీటి సౌకర్యాలను వారు పర్యవేక్షించారు..

- పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పౌష్టికాహారం,స్వచ్ఛమైన నీటిని అందించాలని పారిశుద్ధ్యం లోపించకూడదని అంగన్వాడి సిబ్బందికి సూచించారు..

- పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం మరియు ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే తమ లక్ష్యం అని తెలిపారు.

- నర్సంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు..

ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారి సహకారంతో నర్సంపేట పట్టణంలోని ప్రతి వార్డులోనీ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి,పారదర్శక పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో 20వ కౌన్సిలర్ శ్రీరామోజు రోజా రాణి,మున్సిపల్ అధికారులు,వార్డ్ ఆఫీసర్,వార్డు జవాన్,మున్సిపల్ సిబ్బంది,19వ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
అభివృద్ధి పనులను వేగవంతం చేయండి: జేసీ.
శుక్రవారం మదనపల్లెలో నిర్వహించిన సమీక్షలో, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ PKMUDA పరిధిలో...
By Pagadala Venkateswar 2026-06-06 05:45:29 0 121
Telangana
పేదలకు చేతినిండా సాయం - ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 1.99 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  :  మల్కాజ్ గిరి నియోజకవర్గంలో సంక్షేమ డోర్ డెలివరీ...
By Sidhu Maroju 2026-01-18 10:19:09 0 255
Telangana
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బర్రె మృతి
మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి పూర్రా విట్టల్ కి చెందిన బర్రె మృతి...
By Gandla Vaijanath 2026-07-04 05:15:34 0 255
Andhra Pradesh
పుంగనూరు: వ్యక్తిని డిమాండ్ తరలించిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో చౌక దుకాణానికి వెళ్తున్న మైనర్ బాలికను ఆటోలో ఎక్కించుకొని అటవీ...
By Kothuru Murali 2026-04-11 06:20:30 0 169
BMA
BJP Declares June 25 as 'Samvidhan Hatya Diwas'
Union Home Minister Amit Shah and PM Modi termed the 1975 Emergency a “dark chapter”...
By Bharat Aawaz 2025-06-25 11:40:55 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com