బీబీఏ మీడియా కమిటీ చైర్మన్ గా జయప్రకాష్ నియామకం

0
212

*బి.బి.ఎ. మీడియా క‌మిటీ ఛైర్మ‌న్‌గా జ‌య‌ప్ర‌కాష్ నియామ‌కం*

 

*విజ‌య‌వాడ‌:- అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన బెజ‌వాడ బార్ అసోసియేష‌న్ (బి.బి.ఎ.) మీడియా క‌మిటీ ఛైర్మ‌న్‌గా విష్ణుబొట్ల జ‌య‌ప్ర‌కాష్(జేపీ) నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు బి.బి.ఎ. అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు విష్ణుబొట్ల ల‌క్ష్మీనారాయ‌ణ‌, వ‌లిబోయిన కిర‌ణ్‌కుమార్‌లు బుధ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. బెజ‌వాడ‌కు చెందిన విష్ణుబొట్ల జ‌య‌ప్ర‌కాష్ గ‌తంలో మీడియా రంగంలో విశేష అనుభ‌వంతో పాటు జ‌ర్న‌లిజం మాస్ క‌మ్యూనికేష‌న్‌, సోష‌యాల‌జీ, సైకాల‌జీ వంటి అంశాల‌లో పోస్ట్ గ్రాడ్యూయేష‌న్ చేసి ఉండ‌డంతో జ‌య‌ప్ర‌కాష్‌ను ఛైర్మ‌న్‌గా నియ‌మించారు. అదేవిధంగా క‌న్వీన‌ర్లుగా సీనియ‌ర్ న్యాయ‌వాదులు పి.వి.ఏడుకొండ‌లు, వి.రాయ‌ప్ప‌, స‌భ్యులుగా పి.న‌గేష్‌కుమార్‌, వంగా ర‌మేష్ కుమార్‌, ఎ.సురేష్‌కుమార్‌, ఉప్పాల శ్రీనివాస‌రావు, పి.ఎస్‌.ఆర్‌. ప్ర‌సాద్ బాబు, పి.స‌త్య‌నారాయ‌ణ‌, సోగాని ర‌మేష్‌కుమార్‌, పి.ఎస్‌.ఆర్‌. ప్ర‌స‌న్నజి, గ‌గ‌న సింధూ, పోతూరు చ‌ర‌ణ్ సుధామ్స్‌ల‌ను నియ‌మించారు.*

 

*క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ నియామ‌కం..*

 

*క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీలో సీనియ‌ర్ న్యాయ‌వాదులు డి.ఎస్‌.మ‌హేంద్ర‌, టి.వి.న‌వ‌కుమార్‌, పెద్దిబోయిన (బండి) జ్యోతిల‌ను నియ‌మిస్తూ బి.బి.ఎ. అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు విష్ణుబొట్ల ల‌క్ష్మీనారాయ‌ణ‌, వ‌లిబోయిన కిర‌ణ్‌కుమార్‌లు ఉత్వ‌ర్వులు జారీ చేశారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
PDS బియ్యం అక్రమంగా తరలిస్తున్న రేండు వాహనాలు స్వాధీనం, 6 టన్నుల PDS బియ్యం పట్టివేత.
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ...
By John Baji 2026-01-12 14:17:57 0 256
Telangana
ఓటు హక్కును కాపాడుకోవాలి.. SIR ముసుగులో ఓటర్ల తొలగింపును తిప్పికొట్టాలి: మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గద్దెరాగడి MNR గార్డెన్స్‌లో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక...
By Avunoori Mahesh 2026-06-11 10:40:58 0 189
Bharat Aawaz
 Article 7 -“Rights of Migrants who Moved to Pakistan During Partition”
 Article 7 of the Indian Constitution What Does Article 7 Say? Article 7 deals with a very...
By Bharat Aawaz 2025-07-02 18:47:39 0 5K
Telangana
ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు ఈ నెల 9 వరకు పొడిగింపు
🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్:  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో  డాక్టర్ బి.ఆర్....
By Chunarkar Jagadeesh 2026-09-01 08:09:21 0 249
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో కారులో మంటలు
పుంగనూరు పట్టణంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ సమీపంలో బుధవారం రాత్రి మరమ్మతుల్లో ఉన్న రేనాల్డ్...
By Kothuru Murali 2026-03-12 14:56:07 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com