మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ విజయవంతం – పోలీసు అధికారులకు ప్రశంస పత్రాల అందజేత

0
230

మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా, జిల్లా న్యాయమూర్తి శ్రీమతి సునీత కుంచాల గారు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని అభినందించి, వారికి ప్రశంస పత్రాలను అందజేశారు.

 

వివిధ రకాల పెండింగ్ కేసులను పరస్పర అవగాహనతో త్వరితగతిన పరిష్కరించడంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేసిందని జిల్లా జడ్జి గారు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజలకు న్యాయం త్వరగా అందే విధంగా పోలీసు శాఖ చేసిన కృషిని కొనియాడారు. పోలీసు అధికారులు ప్రజలతో సమన్వయం కలిగి, న్యాయ వ్యవస్థతో కలిసి పనిచేయడం వల్లే ఈ లోక్ అదాలత్ విజయవంతమైందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవలు అందించాలని సూచించారు.

 

డీసీపీ మాట్లాడుతూ...లోక్ అదాలత్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి న్యాయపరంగా సహకరించిన న్యాయ శాఖ వారికీ డిసిపి గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు త్వరితగతిన న్యాయం అందే విధంగా న్యాయస్థానం, పోలీసు శాఖల మధ్య ఉన్న సమన్వయం ప్రశంసనీయమని డీసీపీ పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో సునీత కుంచాల, జిల్లా జడ్జి, కె. స్వప్న రాణి, అదనపు జిల్లా జడ్జి, వి. భావాని, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, ఎన్. మంజుల, జూనియర్ సివిల్ జడ్జి, పెద్దపల్లి, గోదావరిఖని ఏసిపి ఎమ్ రమేష్ పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ మంథని సిఐ రాజు, పి. రాకేష్ ఏ పిపి పెద్దపల్లి, ఎస్సైలు, పలువురు న్యాయమూర్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ నగరంలో BRS పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు డివిజన్...
By Sadaq Sadaq 2026-05-14 16:32:17 0 137
Health & Fitness
Migraine and Stroke Risk Rise in Scorching Summer: Doctor Explains the Connection
Migraine and Stroke Risk Rise in Scorching Summer: Doctor Explains the Connection As...
By BMA ADMIN 2025-05-20 05:49:20 0 2K
Andhra Pradesh
పుంగనూరు: అవాస్తవాలు ప్రచారం చేయకండి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో...
By Kothuru Murali 2026-01-23 12:54:57 0 199
Andhra Pradesh
పుంగనూరు: చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన ఆదెమ్మ ఆదివారం తమ వ్యవసాయ పొలంలో...
By Kothuru Murali 2026-06-22 10:55:27 0 118
Andhra Pradesh
మదనపల్లె: రూ. 21 కోట్లతో తాగునీటి పనులు.. MLA, జేసీ భూమి పూజ.
మంగళవారం, ఎమ్మెల్యే షాజహాన్ భాషా తెలిపిన వివరాల ప్రకారం, మదనపల్లె ప్రజల తాగునీటి దాహాన్ని...
By Pagadala Venkateswar 2026-05-27 06:10:37 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com