జాబ్ ఇస్తామంటూ యువకుడిని మోసం చేసిన సైబర్ గ్యాంగ్.|

0
388

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా : అల్వాల్ పరిధిలో మరోసారి సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. ఆన్‌లైన్ ట్యూషన్ జాబ్ పేరుతో యువకుడిని మోసం చేసి భారీ మొత్తంలో డబ్బు దోచుకున్నారు.

08-04-2026 మధ్యాహ్నం 3:00 గంటలకు హిమాన్షు వినోద్ బిహాని (వయసు 24 సంవత్సరాలు), స్వయం ఉపాధి, భూపతిరావు నగర్, అల్వాల్ నివాసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం, 06-04-2026 ఉదయం 11:48 గంటల నుండి మధ్యాహ్నం 2:50 గంటల మధ్యలో 7428461371 నంబర్ నుండి కాల్ వచ్చి, ఆన్‌లైన్ ట్యూషన్ జాబ్‌కు ఎంపికయ్యారని నమ్మించారు. 

స్మార్ట్ బోర్డ్, ప్రొజెక్టర్, ల్యాప్‌టాప్ పంపిస్తామని చెప్పి ముందుగా ఒక కన్ఫర్మేషన్ అమౌంట్ చెల్లించాలని కోరారు. చెల్లించిన డబ్బును తిరిగి రీఫండ్ చేస్తామని చెప్పడంతో నమ్మిన బాధితుడు మొత్తం రూ.1,07,324/-ను 7 విడతలుగా UPI (QR) ద్వారా పంపించాడు.

తర్వాత ఇది మోసం అని గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయగా, 33704260014762 అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ పొందారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ లు హెచ్చరిస్తున్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: హెల్మెట్ ధరించి వాహనాల నడుపుతున్న వారికి అభినందనలు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, డిఎస్పి మహేంద్ర...
By Kothuru Murali 2026-01-21 10:38:47 0 218
Telangana
ముఖ్యనేత పదవికి ఎసరు పెట్టిన ‘నంబర్‌-2’‎సన్నిహితంగా ఉంటూనే పీఠంపై గురి
మూటల మోతలో వాటాల కొట్లాట! ‎ముఖ్యనేత పదవికి ఎసరు పెట్టిన ‘నంబర్‌-2’...
By Ponnala Srinivasrao 2026-04-03 01:06:24 0 295
Andhra Pradesh
విజయ జూనియర్ కళాశాల విజయ ప్రభంజనం
*వి.జె జూనియర్ కళాశాల విద్యార్థుల ఘన విజయ ప్రభంజనం*    *ఇంటర్ ఫలితాల్లో వి.జె కళాశాల...
By Rajini Kumari 2026-04-15 13:31:00 0 195
Andhra Pradesh
రహదారుల రూపకల్పనకు నిర్మాణాత్మకమైన కృషి. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
బాపట్ల: బాపట్ల నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాలకు మహర్దశ కలిగింది. శాసనసభ్యులు వేగేశన నరేంద్ర...
By Gadiyapudi Narendra 2026-02-04 16:58:00 0 419
SURAKSHA
AP పోలీసులు నేడు: సామాజిక దురాచారాలపై పోరాటం
నేడు AP పోలీసులు సమాజంలోని దురాచారాలపై పోరాడారు. 25 జిల్లాల్లో గ్రామ సమావేశాలు పెట్టి బాల్య...
By Kalaga Sailaja 2026-07-04 09:35:15 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com