Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి... గెజిట్ విడుదల చేసిన కేంద్రం.

0
377

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తి చట్టబద్ధత ఏర్పడింది. అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయడంతో అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత లభించినట్లయింది.

 

ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి రాజధాని సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిన విషయం తెలిసిందే. అక్కడ లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడంతో, దీనికి అధికారిక ముద్ర పడింది. ఈ ప్రక్రియలన్నీ పూర్తవడంతో కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్ జారీ చేసింది. 

 

2014 నాటి సీఆర్డీయే చట్టంలో పొందుపరిచిన అమరావతిని రాజధానిగా నోటిఫై చేస్తున్నట్లు ఇందులో స్పష్టం చేసింది. ఈ సవరణ చట్టం 2024 జూన్ 2వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లుగా (retrospective effect) గెజిట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 5, సబ్-సెక్షన్ (2)లో ఉన్న "కొత్త రాజధాని ఉంటుంది" (a new capital) అనే పదబంధం స్థానంలో "అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది" (Amaravati shall be the new capital) అని మార్పు చేశారు.

 

ఈ సవరణ ద్వారా 'అమరావతి' అనే పదానికి కూడా చట్టంలో స్పష్టత ఇచ్చారు. 'అమరావతి' అనగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) చట్టం, 2014 నిబంధనల ప్రకారం నోటిఫై చేయబడిన రాజధాని నగర ప్రాంతాలు అని వివరణ జోడించారు. రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ ప్రచురణతో ఈ చట్ట సవరణ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చినట్లయింది. 

 

Search
Categories
Read More
SURAKSHA
Sudhir Rajpal, IAS: Driving Haryana's Growth with Vision
A distinguished 1990-batch IAS officer of the Haryana cadre, Sudhir Rajpal has played a...
By Lokeshwari Panthadi 2026-07-24 08:04:39 0 134
Andhra Pradesh
విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్
విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యాన చంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్.   ...
By Rajini Kumari 2025-12-22 07:46:00 0 262
SURAKSHA
పోలీస్ శిక్షణతో యువతకు ఉపాధి - AP స్కిల్ డెవలప్మెంట్ మిషన్
నిరుద్యోగ యువతకు చేయూత ఇచ్చేందుకు AP పోలీస్ "యువశక్తి" స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నడుపుతుంది....
By Kalaga Sailaja 2026-07-01 10:09:26 0 88
Andhra Pradesh
గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రతా ఏర్పాట్లు చేపట్టిన గుంటూరు జిల్లా పోలీస్ శాఖ.
గుంటూరు  తేదీ 05.02.2026 న తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపూడి గ్రామం వద్ద, ఎంఎల్ఏ...
By John Baji 2026-02-05 02:42:15 0 542
SURAKSHA
WB Police Campaign for a Drug-Free West Bengal
Protecting the youth from the perils of substance abuse is a top priority for the West Bengal...
By Kalaga Sailaja 2026-06-27 07:53:53 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com