₹. 50 లక్షల విలువైన గంజాయి పట్టివేత – నలుగురు అరెస్ట్.|

0
404

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. మొత్తం 42.9 కిలోల గంజాయితో పాటు రూ.72,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌లోని తుని, నర్సీపట్నం, కాకినాడ ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతానికి సరఫరా చేయాలనే ప్లాన్ చేశారు. ఇందుకోసం నలుగురు నిందితులు గంజాయిని నాలుగు బ్యాగుల్లో పెట్టుకొని కొణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో సికింద్రాబాద్‌కు తీసుకువచ్చారు.

శనివారం పగలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ వర్క్స్ కార్యాలయం వద్ద గంజాయి కొనుగోలుదారుడి కోసం ఎదురు చూస్తుండగా, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ నేతృత్వంలోని బృందం వారిని అదుపులోకి తీసుకుంది.

నిందితుల వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 20 గంజాయి పాకెట్లు లభించాయి. వాటిని తూకం వేయగా 42.9 కిలోలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ వద్ద నుంచి రూ.72,500 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయిన నిందితులు.. గణేష్ శివనాథ్ బోడుగే (42)పరమేశ్వర్ దామోదర్ బాలప్ (33)విన్నీ శైలేష్ మేశారాం (32)ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ (54)

వీరు మహారాష్ట్రకు చెందినవారని పోలీసులు గుర్తించారు.

విచారణలో నిందితులు తెలిపిన వివరాల ప్రకారం… తుని, నర్సీపట్నం ప్రాంతాల్లో కిలోకు రూ.4,000కు గంజాయిని కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో రూ.12,000 నుంచి రూ.20,000 వరకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.

ఈ ఆపరేషన్‌లో సీఐ చంద్రశేఖర్ గౌడ్, కోటమ్మ, ఎస్సైలు శ్రీనివాసులు, రూప, భూపాల్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. నిందితులను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అభినందించారు.

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
SURAKSHA
Lakshadweep Police: Building Trust Through Community Policing
The Lakshadweep Police are redefining the traditional role of law enforcement by prioritizing...
By Lokeshwari Panthadi 2026-07-03 07:47:50 0 87
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ గారు మర్యాదపూర్వకంగా కలిశారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈగల్...
By Chennaiah Kati 2026-07-05 14:22:03 0 154
Andhra Pradesh
ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ కేంద్రం: భయాందోళనలో పిల్లల తల్లిదండ్రులు!
చింతూరు మండలం రత్నపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణం గత 10 సంవత్సరాలుగా అసంపూర్తిగానే...
By Shyamala Yadagiri 2026-06-03 11:43:59 0 281
SURAKSHA
A. Mallikarjuna, IAS: Driving Excellence in Public Governance
A Dynamic Civil Servant Advancing Revenue Administration, Public Welfare, and Citizen-Centric...
By Lokeshwari Panthadi 2026-07-13 11:47:59 0 201
Andhra Pradesh
Chowdepalli: చౌడేపల్లి మండలంలో మదనపల్లె డీడీఓ శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు.
చౌడేపల్లి: చౌడేపల్లి మండలంలో మదనపల్లె డివిజనల్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు విస్తృతంగా...
By Pagadala Venkateswar 2026-07-31 09:56:05 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com