గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేయలేం

0
261

*గ్యాస్ డోర్ డెలివరీ చేయలేం*

 

*డోర్ డెలివరీ చేసే క్రమంలో సిలిండర్లు మాయమైపోతున్నాయి.*

 

*పోయిన సిలిండర్లకు యాజమాన్యం మా వద్ద నగదు వసూలు చేస్తున్నారు*

 

*మాకు నెల జీతాలు కూడా ఇవ్వరు*

 

 *డెలివరీ బాయ్ ల ఆవేదన*

 

*మంగళగిరి:*

ప్రస్తుత పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరీ చేయలేకపోతున్నామని, సిలిండర్లు డోర్ డెలివరీ చేసే సమయంలో ఆటోల వద్దకు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఫుల్ సిలిండర్ లను తీసుకువెళ్లిపోతున్నారని పలువురు డెలివరీ బాయ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరిలో గ్యాస్ ఏజెన్సీల ఇష్టారాజ్యం పేరుతో నేటి దినపత్రిక సూర్య లో శనివారం కథనం ప్రచురితమైన విషయం 

విదితమే. ప్రభుత్వ నిబంధనల మేరకు వినియోగదారులకు డోర్ డెలివరీ చేయించాల్సిన ఏజెన్సీ నిర్వాహకులు పట్టీ పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా మంగళగిరి నగరంలోని రాయల్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారులను నేటి వరకు ముప్పతిప్పలు పెడుతూనే ఉన్నారు. డెలివరీ బాయ్ ల చేత ఆటోల్లో సిలిండర్లను పంపించి చేతులు దులుపుకుంటున్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెంకు రెండు ఆటోల్లో గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ నిమిత్తం పంపారు. అయితే డెలివరీ బాయ్ లు డోర్ డెలివరీ చేయకుండా ఒక ఆటోను శ్రీనగర్ కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద , మరొక ఆటోను శివాలయం వద్ద పార్కింగ్ చేశారు. గ్యాస్ బుకింగ్ చేసిన వినియోగదారులకు డెలివరీ బాయ్ లు ఫోన్ చేసి ఆటో నిలిపియున్న కూడలిని చెప్పి ఖాళీ సిలిండర్ తీసుకువస్తే నిండు సిలిండర్ ఇక్కడే ఇచ్చివేస్తామని చెప్పారు. దీంతో కొందరు వినియోగదారులు అక్కడకు ఖాళీ సిలిండర్ ను తీసుకువచ్చి ఫుల్ సిలిండర్లను తీసుకువెళ్లగా మరి కొందరు వినియోగదారులు తాము అక్కడకు రాలేమని, దయచేసి డోర్ డెలివరీ చేయాలని వేడుకున్నారు. డోర్ డెలివరీ చేస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోల వద్దకు వచ్చి ఫుల్ సిలిండర్లను తీసుకువెళ్లిపోతున్నారని, కావున డోర్ డెలివరీ ఇవ్వలేకపోతున్నామని సమాధానం చెప్పారు. యాజమాన్యం పోయిన సిలిండర్లకు సైతం తమ వద్ద నుంచి నగదు వసూలు చేస్తుందని, పైగా తమకు జీతాలు కూడా ఇవ్వడం లేదని డెలివరీ బాయ్ లు ఆవేదన వ్యక్తం చేశారు. 

 

 *బెదిరిస్తున్నారంటూ ఏజెన్సీ నిర్వాహకునికి ఫోన్ చేసిన డెలివరీ బాయ్*

 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం డోర్ డెలివరీ ఎందుకు చేయడం లేదని అడిగితే... ఎవరో వచ్చి తనను బెదిరిస్తున్నాడని ఓ డెలివరీ బాయ్ వెంటనే ఏజెన్సీ నిర్వాహకునికి ఫోన్ చేసి సమాచారం చెప్పడం కొసమెరుపు. కనీసం ఏజెన్సీ నిర్వాహకుడైనా వచ్చిన వినియోగదారునితో ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం కూడా చేయకపోవడం వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది.     

 

*డోర్ డెలివరీ బాయ్ తో ఫోన్ లో మాట్లాడిన పౌరసరఫరాల శాఖ అధికారి*

 

కాగా యర్రబాలెం లో గ్యాస్ డోర్ డెలివరీ చేయడం లేదనే సమాచారం తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనివాసరావు రాయల్ గ్యాస్ ఏజెన్సీకి చెందిన డెలివరీ బాయ్ తో ఫోన్ లో మాట్లాడారు. ఒకే చోట ఆటోను నిలిపి వినియోగదారులను అక్కడికి రప్పించి సిలిండర్లను ఇవ్వరాదని, కచ్చితంగా డోర్ డెలివరీ చేయాలని సూచించారు. దీంతో డెలివరీ బాయ్ అప్పటివరకు తీసుకున్న ఖాళీ సిలిండర్ లను ఆటోలో లోడ్ చేసుకొని... 26 ఫుల్ సిలిండర్లు తిరిగి ఏజెన్సీ వద్దకే తీసుకువస్తున్నానని నిర్వాహకులకు తెలిపాడు. వారు ఇబ్బంది ఏమిటని డెలివరీ బాయ్ ను ప్రశ్నించగా... డోర్ డెలివరీ ఇవ్వాలంట... డోర్ డెలివరీ ఇవ్వడం నావల్ల కాదు... అందుకే సిలిండర్లను తిరిగి తీసుకు వచ్చేస్తున్నాను అంటూ సమాధానం చెప్పాడు. ఈలోగా మరికొందరు వినియోగదారులు ఖాళీ సిలిండర్ లను ఆటో వద్దకు తీసుకురావడంతో చేసేది లేక నగదు తీసుకొని ఫుల్ సిలిండర్ లను పంపిణీ చేసి కొద్దిసేపు అనంతరం ఏజెన్సీ వద్దకు బయలుదేరి వెళ్ళిపోయాడు.

 

*నరకయాతన పడుతున్న వృద్దులు*

 

ఆటోల వద్దకు ఖాళీ సిలిండర్ లను తీసుకొచ్చే క్రమంలో ప్రధానంగా వృద్ధ వినియోగదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొందరు వృద్ధులు ఆటోలలో వస్తుండగా మరి కొందరు తమ ద్విచక్ర వాహనాలపై ఖాళీ సిలిండర్లను తీసుకువస్తున్నారు.

ఈ క్రమంలో ఓ వృద్ధ వినియోగదారుడు తన ద్విచక్ర వాహనంపై ఫుల్ సిలిండర్ ను తీసుకు వెళుతూ... ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపైనే పడిపోయాడు. గమనించిన తోటి వినియోగదారులు వెళ్లి వృద్ధ వినియోగదారుడిని పైకి లేపారు. అయితే ఈ ప్రమాదంలో వృద్ధునికి ఎటువంటి గాయాలు కాలేదు. డోర్ డెలివరీ చేస్తే తమకు ఇటువంటి ఇబ్బంది ఉండేది కాదని, ఇప్పటికైనా సీనియర్ సిటిజన్స్ ను సైతం దృష్టిలో పెట్టుకొని గ్యాస్ డోర్ డెలివరీ చేసేలా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు వృద్ధులు కోరుతున్నారు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
జర్మనీలో ప్రేమ.. పల్నాడులో పెళ్లి.. యాపిల్ ఉద్యోగి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.
పల్నాడు జిల్లా యువకుడిని పెళ్లాడిన జర్మనీ యువతి జర్మనీలో చదువుకునే రోజుల్లో చిగురించిన ప్రేమ...
By Pagadala Venkateswar 2026-06-20 04:41:10 0 111
Rangareddy
తుంపల్లికి మోక్షమెప్పుడు.
కొందుర్గు భారత్ ఆవాజ్: కొందుర్గు మండలకేంద్రం నుంచి తూంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు అస్తవ్యతంగా...
By Saidupally Ashok 2026-07-30 10:52:39 0 579
Andhra Pradesh
భూమి రికార్డుల తారుమారు కలెక్టర్‌కు బాధితుడి మొర
బాపట్ల,  సొంత భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో జరిగిన అవకతవకలపై బాపట్ల జిల్లా...
By Vadlamudi NagaVenkat 2026-05-15 11:32:23 0 319
Tamilnadu
Tamil Nadu Strengthens Law and Order Across the State
Tamil Nadu continues to reinforce its law and order framework through modern policing, enhanced...
By Fathima Safa 2026-07-02 07:25:57 0 87
BMA
Delhi HC Protects Press Archives Over Digital Erasure
The Delhi High Court recently balanced the "Right to Be Forgotten" with open justice, ensuring...
By JoinBMA 2026-08-20 05:09:25 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com