పవిత్రమైన తిరుమల తిరుపతి పై మచ్చగా బి.ఆర్ నాయుడు

0
237

ఎమ్మిగనూరులో వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహ జ్వాలలు 

ఎమ్మిగనూరులో జరిగిన భారీ నిరసన ర్యాలీలో టీటీడీ చైర్మన్‌గా కొనసాగుతున్న బి.ఆర్ నాయుడు పై వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మిగనూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు .

స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ట్యాంక్ బండ్ రోడ్డు శ్రీ శ్రీ మారుతి వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు భారీగా సాగింది.

ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు

తిరుమల పవిత్రతను కాపాడండి”, “బి.ఆర్ నాయుడు ను వెంటనే తొలగించండి”

మహిళలతో అక్రమ సంబంధాల గురించి అడిగితే బెదిరింపులు, అక్రమ అరెస్టులు

 శ్రీవారి పవిత్రతను కాపాడే పదవిలో భూతు, రోత నాయుడు సిగ్గు సిగ్గు..

రాజీనామా చెయ్యమన్నందుకు హింస దౌర్జన్యాలతో ప్రతిపక్షంపై రాక్షసకాండ......అంటూ గట్టిగా నినాదాలు చేశారు.

పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేసిన నాయకత్వం

కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు చిహ్నమైన తిరుమల తిరుపతి దేవస్థానంవంటి మహా పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తే, తన ప్రవర్తనతో ఆ పవిత్రతను కాలరాస్తున్నాడని మండిపడ్డారు.

ఇది కేవలం పరిపాలనా వైఫల్యం కాదు… ఇది భక్తుల విశ్వాసంపై జరిగిన దాడి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

అనైతికతకు ప్రతీక – చైర్మన్ పదవికి అవమానం

మహిళలపై అనైతిక ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటూ, వాటిపై ప్రశ్నిస్తే బెదిరింపులు, అక్రమ చర్యలకు దిగడం — ఇవన్నీ ఒక ప్రజా బాధ్యత గల పదవిలో ఉన్న వ్యక్తి లక్షణాలు కావని తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఇలాంటి వ్యక్తి చైర్మన్ కుర్చీలో కూర్చోవడం తిరుమల మహత్యానికే అవమానం” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిగ్గు లేకుండా పదవిలో కొనసాగడం దారుణం

తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ పదవిని వదలకుండా కొనసాగడం నైతిక పతనానికి పరాకాష్ట అని విమర్శించారు.

భక్తుల ముందు కనీస గౌరవం ఉంటే, ఒక్క క్షణం కూడా ఆ కుర్చీలో ఉండేవాడు కాదు

అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు 

ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందిన తిరుమల క్షేత్ర ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తే ఇలాంటి ఆరోపణలకు కేంద్రంగా మారడం హిందూ సమాజానికి తీవ్ర అవమానమని పేర్కొన్నారు.

తిరుమల సేవ అంటే భక్తి,

వినయం… కానీ ఇక్కడ కనిపిస్తున్నది అహంకారం, అనైతికత” అని తీవ్రంగా దుయ్యబట్టారు.

వెంటనే తొలగించకపోతే ప్రజా ఉద్యమం.

బి.ఆర్ నాయుడు ను తక్షణమే పదవి నుండి తొలగించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
తెలంగాణ పోలీసులు హరిత తెలంగాణ కోసం వృక్షారోపణ
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ పోలీసులు ఈరోజు హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు పరిసరాల్లో భారీ...
By Kalaga Sailaja 2026-07-06 05:02:33 0 193
Andhra Pradesh
చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు..
  చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో! 20-06-2026 Sat 16:49...
By Pagadala Venkateswar 2026-06-20 13:35:28 0 110
Telangana
కాళేశ్వరం పర్యటనలో సీఎం తో పాటు పాల్గొననున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాల : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులుతో మరియు...
By Avunoori Mahesh 2026-04-20 03:52:37 0 204
Bharat Aawaz
1975 Emergency to Today: Are We Truly Free?
"𝐖𝐡𝐞𝐧 𝐭𝐫𝐮𝐭𝐡 𝐢𝐬 𝐬𝐢𝐥𝐞𝐧𝐜𝐞𝐝, 𝐝𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐲 𝐰𝐡𝐢𝐬𝐩𝐞𝐫𝐬 𝐢𝐧 𝐟𝐞𝐚𝐫." 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓, 𝟏𝟗𝟕𝟓 𝐨𝐧𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐝𝐚𝐫𝐤𝐞𝐬𝐭 𝐧𝐢𝐠𝐡𝐭𝐬 𝐢𝐧...
By Bharat Aawaz 2025-06-25 07:37:02 0 2K
Andhra Pradesh
రౌడీ షీటర్ హత్య.. మదనపల్లెలో మూలాలు
పుంగనూరు రౌడీషీటర్ డీజే భాస్కర్ కర్ణాటక నంగిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు గురికావడం...
By Kothuru Murali 2026-02-12 14:05:56 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com