ఇంద్రకీలాద్రి వెండి రథంపై ఊరేగిన ఆది దంపతులు

0
225

*పత్రికా ప్రకటన*         

 

*ఇంద్రకీలాద్రి,02 ఏప్రిల్ 2026*

 

" వెండిరధం పై ఊరేగిన ఆదిదంపతులు"

 

ఇంద్రకీలాద్రి పై వైభవంగా జరుగుతున్న శ్రీ దుర్గామల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్బంగా వాహన సేవల్లో భాగంగా...సాయంత్రం 5 గంటలకు -శ్రీ మల్లేశ్వర మహా మండపం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వరుల వెండిరధోత్సవం ప్రారంభం అయింది.

సంప్రదాయ కళలైన తప్పెట్లు, కోలాట నృత్యములు, తాళం భజన కళాకారుల ప్రదర్శలు ముందు సాగుతుండగా, వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాల నడుమ శ్రీ దుర్గా మల్లేశ్వరుల వెండి రధోత్సవసేవ 

కనకదుర్గానగర్, కుమ్మరి పాలెం సెంటర్, కామకోటి నగర్, శంకర మఠం, విద్యాధరపురం, సొరంగమార్గం, కొత్తపేట, బ్రాహ్మణవీధి,రధం సెంటర్ మీదుగా దేవస్థానమునకు చేరుకుంటుంది.

వెండిరధంపై కొలువైన ఆది దంపతులు భక్త కోటిని అనుగ్రహించారు.

ఆది దంపతులు వేంచేసిన వెండి రధం ముందు రహదారులను వివిధ ప్రాంతాల్లో మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి, హారతులు,కొబ్బరికాయలు సమర్పించి, జయ జయద్వానాలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ),ఆలయ ఈవో వికె శీనా నాయక్, ధర్మ కర్తల మండలి సభ్యులు, స్థానాచార్య శ్రీ వి. శివ ప్రసాద్ శర్మ,వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ ఏకీకృత కుటుంబ సర్వే ప్రశ్నలు: సర్వేలో అడిగేవి ఇవే.. ముందే సిద్ధంగా ఉండండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఏపీ ఏకీకృత కుటుంబ సర్వేను...
By John Baji 2025-12-27 11:19:24 0 233
Bharat Aawaz
1975 Emergency to Today: Are We Truly Free?
"𝐖𝐡𝐞𝐧 𝐭𝐫𝐮𝐭𝐡 𝐢𝐬 𝐬𝐢𝐥𝐞𝐧𝐜𝐞𝐝, 𝐝𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐲 𝐰𝐡𝐢𝐬𝐩𝐞𝐫𝐬 𝐢𝐧 𝐟𝐞𝐚𝐫." 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓, 𝟏𝟗𝟕𝟓 𝐨𝐧𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐝𝐚𝐫𝐤𝐞𝐬𝐭 𝐧𝐢𝐠𝐡𝐭𝐬 𝐢𝐧...
By Bharat Aawaz 2025-06-25 07:37:02 0 2K
Rangareddy
‎మై హోమ్ భూజాలో ,భక్తి ముసుగులో భారీ స్కెచ్: లడ్డూ పంచాడు.. కోట్లు కొట్టేశాడు!
గ‌తేడాది వేలంలో గ‌ణేశ్ ల‌డ్డూను  భారీ మొత్తానికి ద‌క్కించుకున్నాడు....
By Ponnala Srinivasrao 2026-08-07 12:00:18 0 137
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం
పత్రికాప్రకటన, ఇంద్రకీలాద్రి, విజయవాడ, 26 Dec, 2025 –          ...
By Rajini Kumari 2025-12-26 10:04:50 0 259
Andhra Pradesh
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో...
By Shyamala Yadagiri 2026-03-20 03:01:26 0 337
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com