అయ్యప్ప స్వామి పుట్టినరోజు పురస్కరించుకొని అభిషేకాలు

0
201

విజయవాడ

01-04-2026

 

 ప్రచురణార్థం 

 

*బాబా ప్రశాంతి నిలయంలో అయ్యప్ప స్వామికి అభిషేకాలు*

 

*..........భక్తులకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ*

 

అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు ను పురస్కరించుకొని శ్రీ ఈశ్వర పుత్ర భక్త బృందం వారి ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట లో సాయిబాబా ప్రశాంత నిలయం లో అయ్యప్ప స్వామి వారి పంచలోహ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు ఈశ్వర పుత్ర భక్త బృందం గురుస్వామి కామరాజ్ హరీష్ కుమార్ ఆచారి మరియు బాబా ప్రశాంత నిలయం నిర్వాహకులు భోగవల్లి పృథ్వి సాయి కుమార్ పూజ కైంకర్యాలు నిర్వహించగా అయ్యప్ప భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి నామస్మరణతో కనులవిందుగా అభిషేక కార్యక్రమం కొనసాగింది.అనంతరం అష్టోత్తరపూజలునిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణి చేసి భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా హరీష్ గురుస్వామి మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా సాయిబాబా ప్రశాంత నిలయంలో అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారికి అభిషేకాలు అర్చన కార్యక్రమం నిర్వహించి భక్తులకు మజ్జిగ ప్యాకెట్ల వితరణ చేయడం జరిగిందన్నారు.

 

ఈ కార్యక్రమంలో సత్తిరాజు,శ్రీనివాసన్,నాగోతి సాయి కుమార్,సాయి హర్ష,బబ్లు,పవన్ శ్రీ కళ్యాన్,జగదీష్,మరియు ఈశ్వర పుత్ర భక్త బృందం సభ్యులు,సాయిబాబా ప్రశాంత నిలయం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం విషాదంపై అప్డేట్
పుంగనూరు పట్టణంలో ఆదివారం ఒకే ఇంట్లో నలుగురు వ్యక్తులు వాహనం నుండి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్...
By Kothuru Murali 2026-03-15 10:35:33 0 217
Telangana
భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ కు ఘన నివాళి : ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : 1949 నవంబర్ 26 వ తేదీన భారత రాజ్యాంగాన్ని...
By Sidhu Maroju 2025-11-26 06:46:55 0 212
Andaman & Nikobar Islands
Early Monsoon Onset Hits Andaman and Nicobar Islands
The India Meteorological Department (IMD) confirmed that the Southwest Monsoon officially...
By Dunna Jessicaruth 2026-05-16 05:11:31 0 296
Andhra Pradesh
హనీ గ్యాంగ్ మా ఊరిలో గుప్త నిధులు ఎత్తుకు పోయింది: స్థానికుడు.
మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పొత్తూరు మోహన కృష్ణమ నాయుడు అలియాస్ మధుశ్రీ, హనీ గ్యాంగ్ తనను...
By Pagadala Venkateswar 2026-06-06 05:36:09 0 103
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె బాబు కాలనీలో కులాయిల ద్వారా మంచినీటికి బదులుగా కాలవ నీరు వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Madanapalle: మదనపల్లె పట్టణంలోని బాబు కాలనీలో కులాయిల ద్వారా మంచినీటికి బదులుగా కాలవ నీరు...
By Pagadala Venkateswar 2026-08-06 06:28:56 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com