అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసిన శ్రీ నెట్టెం రఘురాం

0
209

ప్రెస్ నోట్

04.02.2026

 

అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం

 

అమరావతి: కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCCB) చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం గారు ఈ రోజు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, కేడీసీసీ బ్యాంక్ పరిధిలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) మరియు వాటిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిపాలనా అంశాలపై పరిష్కారాన్ని కోరుతూ ముఖ్యమంత్రి వినతిపత్రం సమర్పించారు

 

కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలో PACS సంఘాల్లో సీఈఓ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న అర్హులైన ఉద్యోగులకు ఒకసారి ప్రత్యేక ప్రమోషన్లను పరిశీలించవలసిందిగా ఆయన అభ్యర్థించారు. 

 

పలు గ్రామీణ PACS సంఘాలు డైలీవేజ్ సిబ్బందిపై ఆధారపడి పనిచేస్తున్నాయని, అందువల్ల అర్హత పరీక్ష నిర్వహించి, అర్హులైన వారికి న్యాయబద్ధంగా అవకాశం కల్పించాలనే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.

 

కేడీసీసీ బ్యాంక్ మరియు PACS ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయమై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసిన విధంగా వీరికి కూడా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచితే అనుభవజ్ఞులైన సిబ్బంది సేవలు మరింత కాలం అందుబాటులో ఉంటాయని తెలిపారు.

 

కొన్ని వేతనాలు “Suspense Due To Account” కింద నిల్వ ఉండటం వల్ల ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని క్రమబద్ధీకరించేందుకు తగిన మార్గదర్శకాలు జారీ చేయవలసిందిగా ఆయన కోరారు. అదేవిధంగా, అవసరమైన విద్యార్హతలు పొందేందుకు గతంలో ఇచ్చిన గడువును మరికొంత కాలం పొడిగిస్తే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఉద్యోగులకు ఉపశమనం కలుగుతుందని, వారి ఉద్యోగ భద్రత కాపాడబడుతుందని అభ్యర్థించారు.

 

ఈ వినతులన్నీ ఉద్యోగుల ప్రయోజనాలకే పరిమితం కాకుండా, గ్రామీణ సహకార వ్యవస్థ బలోపేతానికి, రైతులకు నిరంతర సేవలందించేందుకు దోహదపడతాయని శ్రీ నెట్టెం రఘురాం గారు తెలిపారు. 

 

ముఖ్యమంత్రి గారు నెట్టెం రఘురాం గారి వినతిని శ్రద్ధగా విని, సంబంధిత శాఖలతో పరిశీలించి సాధ్యమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Search
Categories
Read More
Telangana
ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన పదవ తరగతి కూతురు.
మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.  NLB నగర్లో నివాసముండే తల్లి అంజలి(39)ని తన...
By Sidhu Maroju 2025-06-24 04:55:54 0 1K
Andhra Pradesh
Chandrababu Naidu: నాలెడ్జ్, క్రియేటర్ ఎకానమీగా ఏపీ.. టెక్ దిగ్గజాలతో చంద్రబాబు విస్తృత చర్చలు.
Chandrababu Naidu Aims to Transform AP into Knowledge and Creator Economy Hub నాలెడ్జ్,...
By Pagadala Venkateswar 2026-02-21 04:45:08 0 193
SURAKSHA
The People’s Officer: Mahesh Bhagwat’s Legacy of Justice
Mahesh Bhagwat: A Beacon of Hope and Integrity ​Transforming Policing Through Compassion,...
By Kalaga Sailaja 2026-07-08 09:51:07 0 169
Telangana
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల పరిహారం చెల్లించాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల జిల్లాలో రైతుల మరణం ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్...
By Avunoori Mahesh 2026-05-06 15:06:59 0 231
Andhra Pradesh
ప్రతి ఏటా లాగే.. ఈసారి కూడా దీక్ష చేపట్టిన పవన్.
మంగళగిరిలో వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించిన పవన్ కల్యాణ్  పానకాల...
By Pagadala Venkateswar 2026-06-25 06:17:48 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com