Chandrababu: ఐఆర్‌ఆర్ కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు క్లీన్‌చిట్.

0
183

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) అలైన్‌మెంట్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనతో పాటుగా మంత్రులు నారాయణ, నారా లోకేశ్‌లపై ఉన్న ఆరోపణలను కొట్టివేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేసులో ఎలాంటి ఆధారాలు లేవని నిర్ధారిస్తూ సీఐడీ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్‌ను న్యాయస్థానం ఆమోదించింది. దీంతో గత ప్రభుత్వం హయాంలో సంచలనం సృష్టించిన ఈ కేసు అధికారికంగా మూసివేసినట్లు అయింది.

 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, తమ వారికి లబ్ధి చేకూర్చేలా డిజైన్ మార్చారని ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ అప్పట్లో చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌లను నిందితులుగా చేర్చుతూ కేసు నమోదు చేసింది.

 

అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు దర్యాప్తును సమీక్షించిన సీఐడీ, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిర్ధారణకు వచ్చింది. ఆరోపణలకు తగిన ఆధారాలు లభించలేదని పేర్కొంటూ, 'మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్' (వాస్తవ దోషం) కింద కేసును మూసివేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. సీఐడీ నివేదికను వ్యతిరేకిస్తూ, తన వాదనలు వినాలని కోరుతూ ఫిర్యాదుదారుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఆళ్ల పిటిషన్‌లో సరైన కారణాలు లేవని పేర్కొంటూ దానిని కొట్టివేసింది. అనంతరం సీఐడీ క్లోజర్ రిపోర్ట్‌ను ఆమోదిస్తూ కేసును మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

 

ఇదిలా ఉంటే... ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, ఆయన దాఖలు చేసిన పిటిషన్లకు విచారణార్హత లేదని స్పష్టం చేస్తూ హైకోర్టు వాటిని కొట్టివేసింది. తాజాగా ఏసీబీ కోర్టు తీర్పుతో చంద్రబాబుతో పాటు ఇతరులకు ఈ కేసులో క్లీన్‌చిట్ లభించినట్లయింది.

Search
Categories
Read More
Telangana
ఖాకీల "సైబర్ వసూళ్లు" ఎల్బీనగర్ చౌరస్తాలో ఏసీబీ అధికారుల మెరుపు దాడి -ఇద్దరు పోలీసుల అరెస్టు .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (ఎల్బీనగర్) లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఇద్దరు రిజర్వ్ సబ్...
By Sidhu Maroju 2026-03-09 12:46:14 0 208
Andhra Pradesh
సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డి భార్యకు చుక్కెదురు.
పెద్దిరెడ్డి భార్యకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తాము PLR ప్రాజెక్ట్ Pvt. Ltd సంస్థ తరఫున...
By Pagadala Venkateswar 2026-03-25 12:59:16 0 218
Telangana
ఆర్టీసీ కార్మికుల సమ్మెకి సంపూర్ణ మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు
మంచిర్యాల :కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని...
By Avunoori Mahesh 2026-04-23 08:34:41 0 188
Sports
యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ లో పాల్గొన్న సాట్స్ చైర్మన్ : శివసేన రెడ్డి
గచ్చిబౌలి మైదానంలో యంగ్ ఇండియా ఫిసికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో...
By Avunoori Mahesh 2026-04-30 10:49:37 0 233
Andhra Pradesh
శ్రీకాకుళం: 'టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలి'
శ్రీకాకుళం నగరంలో జర్నలిస్టుపై జరిగిన దాడికి నిరసనగా జర్నలిస్టు నాయకులు ఆందోళన చేపట్టారు. ఆ...
By Manda Ramkumar 2026-03-28 09:00:03 0 559
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com