అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సి ఐ టి యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.

0
239

అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ ఎమ్మిగనూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్ ముందు అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు కార్యదర్శి బి. గోవర్ధనమ్మ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా నుద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ గారు మాట్లాడుతూ గత 7 సం.లుగా అంగన్వాడీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు పెంచడంలో మొండిగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. నిత్యవసర వస్తువుల ధరలు, అన్ని రకాల ప్రభుత్వ భారాలు రోజురోజుకు పెరుగుతున్న అంగన్వాడీలకు మాత్రం వేతనాలు పెంచకపోవడం సిగ్గుచేటని ఆరోపించారు. ఐసిడిఎస్ పథకం ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. అంగన్వాడీలు వర్కర్లు, హెల్పర్లు బాలింతలు, గర్భిణీలు, పసిపిల్లలకు చేసిన సేవలకు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కు మంచి గుర్తింపు వచ్చిందని.ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంగన్వాడీ వర్కర్ల ను మూడో తరగతి ఉద్యోగులుగా, హెల్పర్లనుg నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఇటీవల గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. 2022లో సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాడ్యుటి అమలు చేయాలని తీర్పు చెప్పిందని తెలిపారు. అయినా నేటికీ అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. 2023 డిసెంబర్ లో 42 రోజులు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేసినా వైసీపీ ప్రభుత్వం మొండిగా అంగన్వాడీ వేతనాలు పెంచలేదని తెలిపారు. ఈ కూటమి ప్రభుత్వం 22 నెలలు గడిచినా వేతనాలు పెంచుతామని ప్రస్తుతం ఉన్న మంత్రులు ఆయా నియోజకవర్గాల డిసెంబర్ లో సమ్మె సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేతనాలు వెంటనే పెంచుతామని ఇచ్చిన హామీని మరిచిపోయారని విమర్శించారు. ఈ సంవత్సరం మార్చి రెండవ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున అంగన్వాడీలు ధర్నా నిర్వహించారని దానికి కంటిన్యూనేషన్ గా దీక్షలు కొనసాగిస్తున్న సందర్భంగా అర్ధరాత్రి పూట అంగన్వాడీలపై పోలీసులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని పీకేసి మహిళలని చూడకుండా 100, 120 కిలోమీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్లకు తరలించారని ఇంతకంటే దురదృష్టం మరొకటి లేదని ఆవేదన వ్యక్తం చేశారు అందువల్ల ఈరోజు అన్ని ప్రాజెక్టుల ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నామని రాబోవు కాలంలో మరింత పెద్ద ఎత్తున సమ్మె పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు గోవిందు, రాముడు మాట్లాడారు. అంగన్వాడి కార్యకర్తలు ఎస్. నాగలక్ష్మి, నాగ శిరోమణి, యు.ఎం. నాగలక్ష్మి, మున్ని, హుస్సేనమ్మ, మల్లేశ్వరి, నిర్మల, లతా రాణి, గ్రేసమ్మ, మేరీ, రామలింగమ్మ, అరుణా, తులసి, హేమలత, భాగ్యలక్ష్మి, సుమిత్ర, అనురాధ, తిప్పమ్మ, రామేశ్వరి, రంగమ్మ, పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నూరు నియోజకవర్గ :సదుంలో పర్యటించిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం, సదుం లో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం...
By Kothuru Murali 2026-03-21 06:20:14 0 207
Andhra Pradesh
పుంగనూరు: అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు నివారించవచ్చు
ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్...
By Kothuru Murali 2026-04-19 11:08:54 0 133
SURAKSHA
Shri Avinash Kumar, IAS: Leading Jharkhand with Vision and Integrity
A distinguished 1993-batch Jharkhand cadre IAS officer whose visionary leadership, transparent...
By Kalaga Sailaja 2026-07-31 11:44:10 0 304
Andhra Pradesh
జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలు .
జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలకు (Aichi-Nagoya Asian Games 2026) ఇంటర్నేషనల్ టెక్నికల్...
By Santhosh Kumar 2026-09-13 10:05:49 0 144
SURAKSHA
Bhushan Gagrani IAS: Driving Mumbai's Growth with Vision
The Journey begins When one of the world's largest municipal corporations requires...
By Fathima Safa 2026-07-20 14:43:50 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com