గ్యాస్ బ్లాక్ దందా బట్టబయలు.. 420 సిలిండర్లు స్వాధీనం.|

0
175

 

 

 

హైదరాబాద్‌ : బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల దందాను టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. డీసీపీ టాస్క్ ఫోర్స్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీ స్థాయిలో అక్రమ గ్యాస్ వ్యాపారం వెలుగులోకి వచ్చింది.

పంజగుట్ట స్మశాన వాటిక ప్రాంతంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మొత్తం 10 మంది పై కేసులు నమోదు చేశారు.

టాస్క్ ఫోర్స్ అధికారులు ముఠా నుంచి 420 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ దందాలో ఉపయోగించిన రెండు ఆటోలు, రెండు బొలెరో వాహనాలు, ఒక ఓమినీ, రెండు డీసీఎం వాహనాలను కూడా జప్తు చేశారు.

దర్యాప్తులో భాగంగా మెట్రో హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం కూడా ఈ బ్లాక్ దందాలో పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువగా సుమారు 2100 రూపాయల విలువ గల సిలిండర్లను 6 వేల రూపాయలకు విక్రయిస్తున్నట్టు వెల్లడైంది.

ఇదిలా ఉండగా  “గ్యాస్ సప్లై”  పేరుతో ప్రచారం జరుగుతున్న విషయాన్ని ప్రజలు నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. కావాలనే తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
భవాని భక్తుల సౌకర్యాన్ని మరిన్ని పెంచండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ నగరపాలక సంస్థ 13-12-2025      *భవాని భక్తుల సౌకర్యాలను మరిన్ని...
By Rajini Kumari 2025-12-13 11:22:11 0 473
Andhra Pradesh
నిరంతరాయమైన విద్యుత్ ను అందిచడమై లక్ష్యం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే MMకొండయ్య.
చీరాల: విద్యుత్ రంగానికి కూటమి సర్కార్ పెద్ద పీట. నూతనంగా నిర్మించనున్న విద్యుత్...
By Gadiyapudi Narendra 2026-02-18 15:57:06 0 224
Telangana
ఓ సీఎం సర్..అతను నీకు గులామ్ అనుకున్నవా
ఇందూరు ప్రజల గుండె చప్పుడు. నీ ప్రభుత్వంలో అతను ప్రజా ప్రతినిథి కాకపోవచ్చు. కానీ గురువుకే గురువు...
By Ponnala Srinivasrao 2026-03-25 02:23:28 0 214
Telangana
"హరిజనబస్తీ డిసిల్టింగ్‌పై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఫోకస్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హరిజనబస్తీ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న డిసిల్టింగ్ (మట్టిని...
By Sidhu Maroju 2026-04-20 13:00:04 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com