విద్యార్థుల భవిష్యత్తుకు 'గరుగు' భరోసా

0
562

Bharath aawaz today news మొయినాబాద్, మార్చి 27: విద్యార్థుల విద్యా భవిష్యత్తు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మొయినాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గరుగు రాజు తన ఉదారతను చాటుకున్నారు. హిమాయత్నగర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు ఆరు నెలల క్రితం పదోన్నతిపై వెళ్లడంతో, పదో తరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆయన గుర్తించారు. పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో విద్యార్థులకు నష్టం

జరగకూడదని భావించిన ఆయన, జీ ఆర్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా మహేందర్ అనే ప్రైవేట్ గణిత ఉపాధ్యాయుడిని నియమించారు. నియమించిన ఉపా ధ్యాయుడికి బుధవారం తన సొంత డబ్బులతో గరుగు రాజు వేతనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులే దేశ భవిష్యత్తుకు దిక్సూచి అని, వారికి నాణ్యమైన విద్య అందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఎంఈఓ మల్లయ్య, ప్రధానోపాధ్యాయురాలు జులేక సుల్తానా, ఎస్ఎంసి ఛైర్మన్ మహేశ్వరి, నాయకులు చదువు రామచందర్, ఉపాధ్యాయులు రాములు, అరుణ, శైలజ, భాగ్యలక్ష్మి, సుమిత్ర, సుగుణ, రవి, విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bihar
Prashant Kishor Challenges Rahul Gandhi to Spend a Night in Bihar Village
Patna: Jan Suraaj leader Prashant Kishor has targeted Congress MP Rahul Gandhi, challenging him...
By Bharat Aawaz 2025-06-27 09:54:45 0 2K
Andhra Pradesh
పుంగనూరు:అండర్ 19 ప్రపంచ కప్ విజయంపై రాజశేఖర్ రెడ్డి అభినందనలు
పుంగనూరులో జిల్లా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, అండర్ 19 ఇండియా వరల్డ్ కప్ సాధించడం ఎంతో ఆనందంగా...
By Kothuru Murali 2026-02-07 08:48:30 0 222
Andhra Pradesh
నారాయణ స్కూల్ నూతన భవన ప్రారంభ ఉత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
రాయచోటి పట్టణం మాసాపేట వరిగ రోడ్డులో ఈరోజు ఉదయం నూతన భవన ప్రవేశ మహోత్సవం లో పాల్గొన్న రాజంపేట...
By Benguluri Madhubabu 2026-03-08 12:51:03 0 209
Andhra Pradesh
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ
*ఢిల్లీ*   తాజ్ ప్యాలెస్ హోటల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Rajini Kumari 2025-12-20 14:50:27 0 258
Andhra Pradesh
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ఈ తరహా రాజకీయాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు 06-02-2026 Fri...
By Pagadala Venkateswar 2026-02-06 13:24:19 0 371
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com