తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ నోట్

0
444

ప్రెస్ నోట్.

*రేపు నిజామాబాద్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన*

*శ్రీ రఘునాథ స్వామి (ఖిల్లా రాంమందిర్) ఆలయంలో శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించనున్న కవిత దంపతులు*

*అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం*

*శ్రీరామ నవమి సందర్భంగా డిచ్ పల్లి, బోధన్,ఆర్మూర్, పోచంపాడు, జగిత్యాల, కోరుట్ల రామాలయాల్లో కవిత దంపతుల తరఫున పట్టు వస్త్రాలు.* 

శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేయనున్నారు. తన మెట్టినిల్లు అయిన నిజామాబాద్ వేదికగా ఆమె చేయనున్న ప్రకటనపై ఆసక్తి నెలకొంది. నిజామాబాద్ జాగృతి కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అంతకు ముందు శ్రీ రఘునాథ ఆలయం (ఖిల్లా రాంమందిర్) లో జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొంటారు. శ్రీ సీతారాముల కళ్యాణంలో తన భర్త దేవనపల్లి అనిల్ తో కలిసి కవిత పాల్గొంటారు. శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆ రాముల వారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రంపై ఉండాలని, ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆమె ఆకాంక్షించారు. 

*పలు రామాలయాల్లో పట్టు వస్త్రాల సమర్పణ*

ఏటా శ్రీరామ నవమి సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజవవర్గ పరిధిలోని రామాలయాల్లో కవిత దంపతులు పట్టు వస్త్రాలు సమర్ఫించటం ఆనవాయితీ. ఈ ఏడాది రఘనాథ స్వామి ఆలయంలో కవిత దంపతులు స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. డిచ్ పల్లి, బోధన్, ఆర్మూర్ సిద్దుల గుట్ట, పోచంపాడు, జగిత్యాల్ ధరూర్ క్యాంప్, విద్యానగర్ రామాలయం, కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలోని వాల్గొండ రామాలయాల్లో కవిత దంపతుల తరఫున వారి ప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పించున్నారు. శ్రీరామ నవమి వేడుకల్లో కవిత గారితో పాటు జాగృతి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.

Search
Categories
Read More
Bihar
Bihar Boosts Industrial Growth and Investment Drive
Bihar is steadily advancing its industrial growth and investment landscape through focused...
By Fathima Safa 2026-07-01 06:09:18 0 191
Andhra Pradesh
ఏపీలో 61 రోజుల చేపల వేట నిషేధం.. ఏప్రిల్ 15 నుంచి అమలు.
ఏపీలో సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లోకి రానుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల...
By Pagadala Venkateswar 2026-04-11 06:55:59 0 152
Telangana
త్రివేణి సంగమ తీరంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.....!
భారత్ అవాజ్ న్యూస్: 25 మే రోజున భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అంత్య పుష్కరాల్లో భాగంగా త్రిలింగ...
By Gujile Ramu 2026-05-25 03:34:51 0 165
Andhra Pradesh
అంబటి నోరు అదుపులో పెట్టుకో సుగవాసి ప్రసాద్ బాబు
రాయచోటి అంబటి వ్యాఖ్యలకు నిరసనగా రాయచోటి టిడిపి ఆఫీస్ నందు భారీగా చేరిన కార్యకర్తలు నడుమ అంబటి...
By Benguluri Madhubabu 2026-01-31 14:22:12 0 319
Andhra Pradesh
ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ నాంది పలికిన బోండా ఉమామహేశ్వరరావు
ప్రచురణార్థం:- 26-03-2026   *ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికిన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్...
By Rajini Kumari 2026-03-26 13:46:05 0 260
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com