*ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్లో పై చర్యలు తీసుకోవాలి*

0
307

 

 

 

 ఆదోని పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ముందస్తు అడ్మిషన్లు చేసుకుంటున్నా ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదోని ఆర్డీవో గారికి ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర మరియు జిల్లా కార్యదర్శులు షాహిద్ ఆఫ్రిది, ప్రదీప్ లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్స్ ముందస్తుగా అడ్మిషన్లు చేసుకుంటూ డొనేషన్ల రూపంలో వేలకు వేలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. అలాగే కొన్ని స్కూల్స్లో టీచర్ల కు అడ్మిషన్లు చేయాలని వేధిస్తున్నారని కనీసం ఒక్క టీచర్కు ఐదు అడ్మిషన్ చేసేలా ఒత్తిడి చేస్తూన్నారు వారన్నారు. కొన్ని స్కూల్స్ అయితే మౌలిక వసతులు లేకున్నా తల్లిదండ్రుల నుంచి ఫీజుల రూపంలో పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారని ఇంత జరుగుతున్న కూడా విద్యాధికారులు అటువంటి స్కూల్ లపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రోషన్ సురేష్ రాజు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
చనిపోయిన రైతుల కుటుంబలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి : సీపీఎం రాష్ట్ర నాయకులు
 మంచిర్యాల జిల్లా : లక్షేటీపేట్ మండలం గంపలపల్లి గ్రామంలో చనిపోయిన తనువుల నాగరాజు మరియు...
By Avunoori Mahesh 2026-05-07 14:00:02 0 314
Andhra Pradesh
ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత...
By Chennaiah Kati 2026-07-14 10:52:33 0 109
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని నలంద బిఈడి కాలేజ్ అడ్మిషన్ ప్రారంభం
ఎమ్మిగనూరు పట్టణంలోని నలంద బిఈడి కాలేజ్ అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి అడ్మిషన్ కావాలనుకుంటే ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-06-30 08:43:17 0 155
Andhra Pradesh
పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మెరిసిన ఆణిముత్యాలు (Z
పుంగనూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షల్లో శహవార్ 600కు 592 మార్కులతో స్కూల్...
By Kothuru Murali 2026-05-01 12:32:37 0 140
Andhra Pradesh
గొల్లపల్లి దాడితల్లి సిరిమాను చెట్టు కొట్టిన బేబినాయన
గొల్లపల్లి దాడితల్లి గ్రామ దేవత పండగ ఏప్రిల్ 26, 27, 28న జరగనుంది. ఈ నేపథ్యంలో సిరిమనోత్సవానికి...
By Boiena Rajesh 2026-03-29 23:08:14 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com