పీఈటీ పోస్టుల భర్తీకి డిమాండ్: విద్యార్థుల క్రమశిక్షణకు వ్యాయామ విద్య అవసరం.

0
207

ఉగాది సందర్భంగా విడుదలైన 2026 జాబ్ క్యాలెండర్‌లో పాఠశాల విద్యలో వ్యాయామ విద్య (physical Education) విభాగంలో పీఈటీ పోస్టులు చూపించకపోవడం శోచనీయమని అన్నమయ్య జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షులు నరేష్ బాబు అన్నారు. ప్రభుత్వాలు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడం తప్ప ఆచరణలో శూన్యమని, విద్యార్థులలో క్రమశిక్షణ లోపిస్తోందని, ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి పీఈటీ పోస్టులను, ఉన్నత పాఠశాలలకు ఎస్ఏ (పీఈ) పోస్టులను మంజూరు చేసి, రాబోయే డీఎస్సీ 2026 ద్వారా భర్తీ చేయాలని ఆయన కోరారు. ఇంటర్మీడియట్ కళాశాలల్లో 64 పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పదోన్నతులు కల్పించి జూనియర్ కళాశాలల్లో పోస్టులు భర్తీ చేస్తే సుమారు 700 జూనియర్ లెక్చరర్ (పీడీ) పోస్టులు భర్తీ చేయవచ్చని, యువజన సేవా శాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో జోక్యం చేసుకుని అన్ని ఇంటర్మీడియట్ కళాశాలల్లో పీడీ పోస్టులు మంజూరు చేయాలని అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తోంది.

Search
Categories
Read More
Telangana
"బీఆర్ఎస్ కోరుకున్నట్టు క్షణాల్లో విచారణ జరగదు: రేవంత్ రెడ్డి.|
హైదరాబాద్: రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమార్ కుమారుడిపై...
By Sidhu Maroju 2026-05-11 11:15:16 0 863
Andhra Pradesh
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రేపు ధర్నా
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం బొబ్బిలి ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా...
By Boiena Rajesh 2026-03-23 10:58:54 0 251
Legal
Test Post For New Link Sharing.
Test Post 
By Bharat Aawaz 2026-04-09 18:09:50 0 599
Andhra Pradesh
ముద్రగడ నివాసానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్...
ఈ రోజు కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ...
By BABJI DADALA 2025-12-23 14:50:53 0 402
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com