గంగ అవెన్యూ వాసుల గోస.. రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి!

0
263

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గంగ అవెన్యూ మరియు దాని చుట్టుపక్కల కాలనీల నివాసితుల విజ్ఞప్తి మేరకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బుధవారం ప్రభుత్వ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. 

గంగ అవెన్యూ, ఎంఈఎస్ కాలనీ, కాశీపురం, శ్రీనివాసిక కాలనీల్లో నెలకొన్న నీటి నిల్వ మరియు డ్రైనేజీ సమస్యలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల (RWA) ప్రతినిధులు తమ బాధలను మైనంపల్లి దృష్టికి తీసుకెళ్లారు.

కాలనీల్లో సరైన వర్షపు నీటి కాలువలు (Storm Water Drains), బాక్స్ డ్రైన్లు లేకపోవడం వల్ల వర్షం పడితే లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా గంగ అవెన్యూలోని క్వారీ గుంతలు జలమయమవుతున్నాయని వివరించారు. పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పైప్‌లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని వారు కోరారు.

సమస్య తీవ్రతను గమనించిన మైనంపల్లి హనుమంతరావు అక్కడి నుండే ఎంఎంసీ కమిషనర్ విజయ కృష్ణారెడ్డి (IAS), మల్కాజిగిరి జడ్సీ సంచిత్ గంగ్వార్ (IAS)లతో ఫోన్లో మాట్లాడారు. 

పెండింగ్ పనులకు సంబంధించి తక్షణమే అనుమతులు మంజూరు చేసి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో వాటర్ బోర్డ్ జీఎం సునీల్, డిసి భోగేశ్వర్లు, జీహెచ్‌ఎంసీ ఈఈ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, డీఈ ప్రశాంత్, డీజీఎం సాంబయ్య తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

కాలనీ ప్రతినిధులు జోసెఫ్ రెడ్డి, రెహ్మాన్,  అంజనేయులు, మరియు కాంగ్రెస్ నేతలు సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, లడ్డు రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.

#sidhumaroju

Alwal

Like
1
Search
Categories
Read More
Maharashtra
Maharashtra Strengthens Law and Cyber Security Systems
Maharashtra has intensified efforts to strengthen law and order and cyber security across the...
By Fathima Safa 2026-06-30 08:53:46 0 196
Telangana
ఇంటర్ వార్షిక పరీక్షలకు సన్నద్ధంగా ఉండాలి
ఎస్ఐ రాజు కుమార్     మహబూబాబాద్ జిల్లా,డిసెంబర్ 20(భారత్ అవాజ్):  కొత్తగూడ...
By Bheeshman King 2025-12-20 13:30:01 0 346
Telangana
"స్మశానవాటికలో చేత్తెంటి!.. తక్షణమే తరలించండి :"JAC అల్టిమేటం. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం పరిధిలోని హిందూ స్మశాన వాటిక స్థలంలో కొనసాగుతున్న చెత్త...
By Sidhu Maroju 2026-02-05 13:24:25 0 228
Telangana
గ్రీవెన్స్ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి:: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్ జిల్లా: జనవరి 5(భారత్ అవాజ్):జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,...
By Bheeshman King 2026-01-05 14:04:35 0 436
Andhra Pradesh
కెనాల్ రోడ్లు ఆక్రమించుకున్న ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు
*కెనాల్ రోడ్లో రోడ్డు ఆక్రమించుకున్న*  *ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు*  ...
By Rajini Kumari 2025-12-16 12:05:04 0 231
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com