TTD: శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్.

0
209

శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులకు మంచి రోజులొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీవారి సేవలో ఇకపై ధర్మవరం పట్టు వస్త్రాలు భాగం కానున్నాయి. శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే వారికి అందించే పట్టు శాలువాలను ఇకపై ధర్మవరం నుంచే కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా 65 వేల పట్టు శాలువాల కొనుగోలుకు టీటీడీ అనుమతులు మంజూరు చేసిందని మంత్రి సవిత వెల్లడించారు.

 

ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి ఈ శుభవార్తను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరో మంత్రి సత్యకుమార్, చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, టీడీపీ ధర్మవరం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ శాలువాల సరఫరా కోసం ధర్మవరంలో ప్రత్యేకంగా ఆప్కో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత తెలిపారు. దీని ద్వారా నేరుగా చేనేతల నుంచి వస్త్రాలను కొనుగోలు చేసి టీటీడీకి అందిస్తామని వివరించారు.

 

ఈ సందర్భంగా ధర్మవరం చేనేత కార్మికులు తయారు చేసిన నమూనా పట్టు శాలువాను మంత్రులు సవిత, సత్యకుమార్ ఆవిష్కరించారు. టీటీడీ నిర్ణయంతో ధర్మవరం ప్రాంతంలోని వేలాది చేనేత కుటుంబాలకు ఉపాధి లభించనుండటంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
తెలంగాణ పోలీసులు విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు పాఠశాలల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలు...
By Kalaga Sailaja 2026-07-06 04:57:24 0 295
Andhra Pradesh
అన్నమయ్య: దొంగతనానికి వచ్చి.. కెమెరాలకు చిక్కారు.
శనివారం రాత్రి రాజంపేట మండలం వెంకట రాజంపేటలోని కనకదుర్గమ్మ గుడిలో ఇద్దరు దొంగలు హుండీని బద్దలు...
By Pagadala Venkateswar 2026-05-25 04:20:46 0 129
Andhra Pradesh
పుంగనూరు: మధ్యాహ్న భోజనంలో పడ్డ బల్లి
అన్నమయ్య జిల్లా, పుంగనూరులోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో బుధవారం మధ్యాహ్న భోజనంలో బల్లి...
By Kothuru Murali 2026-04-02 06:10:55 0 181
Andhra Pradesh
శ్రీశైలం మల్లికార్జున ఉత్సవాలకు నారా లోకేష్ కు ఆహ్వానం
*శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం*   ఉండవల్లి:...
By Rajini Kumari 2026-02-07 11:54:47 0 195
Andhra Pradesh
అక్రమ లేఅవుట్‌పై చర్యలు: కొనుగోలుదారులు జాగ్రత్త.
మదనపల్లె మండలం రామాచర్లపల్లెలో అనుమతులు లేకుండా సుమారు 2.85 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు...
By Pagadala Venkateswar 2026-04-09 04:36:24 0 171
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com